ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా యూఎన్‌లో ఓటేసిన భారత్
న్యూఢిల్లీ: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్(Israel)కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మాణానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది. ఆక్రమిత పాలస్తీనా భూభాగం, తూర్పు జెరూసలెం, సిరియాకు చెందిన గోలాన్ హైట్స్‌లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్(తమ దేశస్థులు స్థిరపడేట్లు చేయడం) కార్యకలాపాలకు పాల్పడటాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది.
ఈ తీర్మానానికి అనుకూలంగా 145 దేశాలు ఓటు వేయగా.. 18 దేశాలు తటస్థ వైఖరి అవలంభించాయి. అమెరికా, కెనడా, హంగేరీ, ఇజ్రాయెల్, మార్షల్ ఐలాండ్స్, ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా, నౌరు మాత్రం తీర్మానాన్ని వ్యతిరేకించాయి. కాగా, ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని తక్షణమే ఆపేయాలని కోరుతూ జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ కు భారత్ గైర్హాజరైంది. దీనిలో హమాస్ అనాగరిక చర్యలను పేర్కొనకపోవడాన్ని భారత్ వ్యతిరేకించింది.

అప్పట్లో ఈ తీర్మానం ఓటింగ్ కు భారత్ సహా 45 దేశాలు గైర్హాజరయ్యాయి. 120 దేశాలు మాత్రం దీనికి అనుకూలంగా ఓటేశాయి. మరోవైపు, హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన నాటి నుంచి దాదాపు 11,078 మంది గాజావాసులు ప్రాణాలు కోల్పోయారని పాలస్తీనా అధికారులు వెల్లడించారు. వారిలో దాదాపు 40 శాతం మంది చిన్నారులే ఉన్నారని తెలిపారు. గాజాపై నిరంతర వైమానిక, శతఘ్ని దాడులు నిర్వహిస్తోందని ఆరోపించారు.
ఇది ఇదిఇలావుంటే, హమాస్ ప్రధాన స్థావరంగా అనుమానిస్తున్న అల్-షిఫా ఆస్పత్రి వద్ద ఇజ్రాయెల్ భీకరదారుడు కొనసాగుతున్నాయి. అయితే, గాజా నుంచి సామాన్య పౌరులను తరలించేందుకు తాము సహకరిస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటికే అల్ షిఫా ఆస్పత్రిలోని పసిపిల్లలను తరలించేందుకు సాయం చేయడానికి సిద్ధమని తెలిపారు. ఐడీఎఫ్ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ ఈ మేరకు పేర్కొన్నారు. మరోవైపు, ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు ఆస్పత్రిని చుట్టుముట్టాయి.












Click it and Unblock the Notifications