భారత కాన్సులేట్‌కు నిప్పు; ఆ కాన్సులేట్‌పై రెండోసారి దాడి; ఖండించిన యూఎస్!!

శాన్ ఫ్రాన్సిస్కో లోని భారత కాన్సులేట్ పై పలువురు దుండగులు దాడికి దిగారు. శాన్ ఫ్రాన్సిస్కో లో ఉన్న భారతదేశ కాన్సులేట్ వద్ద బీభత్సం సృష్టించారు. ఆదివారం తెల్లవారుజామున ఒకటిన్నర గంటల నుండి రెండున్నర గంటల మధ్యలో భారత కాన్సులేట్ భవనానికి నిప్పు పెట్టారు. గత ఐదు నెలల కాలంలో కాన్సులేట్ పై జరిగిన రెండవ దాడిగా దీనిని చెబుతున్నారు.

ఖలిస్తానీ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడినట్లుగా సమాచారం. ఖలిస్తానీ మద్దతుదారులు గత మార్చి నెలలో కూడా భారత కాన్సులేట్ ను ధ్వంసం చేశారు. గత కొద్ది రోజులుగా ఖలిస్తాన్ సానుభూతిపరుడు అయిన అమృత పాల్ సింగ్ అరెస్టుకు భారత్ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో వివిధ దేశాల్లో ఉన్న ఖలిస్తాన్ అనుకూల పంజాబీలు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.

Indian consulate in san francisco set on fire; 2nd time attack in five months

ఈ క్రమంలో ఇప్పటికే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో భారత కాన్సులేట్ కార్యాలయం పై, కెనడాలోని దౌత్య కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద వారిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయగా, ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.

అయినప్పటికీ మరోమారు ఖలిస్తానీ మద్దతుదారులు భారత కాన్సులేట్ కు నిప్పు పెట్టి దానికి సంబంధించి ఒక వీడియోను విడుదల చేశారు. అయితే ఇప్పటి వరకు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు జరిగినట్టు, ప్రాణనష్టం జరిగినట్టు నివేదించబడలేదు. శాన్ ఫ్రాన్సిస్కో అగ్నిమాపక విభాగం మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చింది.

ఈ ఘటనపై అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ స్పందించారు. ఇటువంటి దహనం ప్రయత్నాలను, విధ్వంసాలను యూఎస్ ఖండిస్తుందని ఆయన పేర్కొన్నారు. యూఎస్ లోని దౌత్య సౌకర్యాలు మరియు విదేశీ దౌత్యవేత్తలపై విధ్వంసం, హింస క్రిమినల్ నేరంగా పరిగణించబడుతుంది అని పేర్కొన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గతంలోనూ ఖలిస్తానీ మద్దతుదారులు అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ ఇనుప రాడ్ లతో భారత కాన్సులేట్ వద్ద విద్వంసానికి పాల్పడ్డారు. కార్యాలయ గోడపై అమృత్ పాల్ ను వదిలెయ్యాలని గ్రఫిటీ పెయింట్ చేశారు. అక్కడ ఖలిస్తానీ మద్దతు బ్యానర్లను ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+