వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాదం: లండన్‌లో భారత్ రాయబారి కార్యక్రమంలో మాల్యా

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

లండన్: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ ఛైర్మన్ విజయ్ మాల్యా లండన్ పారిపోయిన తర్వాత మీడియాలో ఏవేవో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాల్యా ప్రత్యక్ష్యంగా కనిపించారు.

అది కూడా భారత రాయబాలి లండన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కనిపించారు. వివరాల్లోకి వెళితే... లండన్‌లో 'మంత్రాస్‌ ఫర్‌ సక్సెస్‌-ఇండియాస్ గ్రెటెస్టే సీఈఓస్ టెల్ యు హౌ టు విన్' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. జర్నలిస్ట్ సన్నీ సేన్‌తో కలిసి రచయిత సుహేల్ సేథ్ ఈ పుస్తకాన్ని రచించారు.

Indian Envoy Left London Event After Seeing Vijay Mallya: Suhel Seth

లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో గురువారం జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి భారత హై కమిషనర్‌ నవతేజ్‌ సర్నా తదితరులు హాజరయ్యారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంపై చయిత సుహేల్ సేథ్ తన ట్విట్టర్‌లో స్పందించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మాల్యా హాజరయ్యారని, ప్రేక్షకుల్లో కూర్చున్నారని ఆయన ట్వీట్ చేశారు.

ఈ కార్యక్రమం ఓపెన్ ఈవెంట్ అని ప్రత్యేకించి ఎవరికీ ఆహ్వానాలు పంపించలేదని, ట్విట్టర ద్వారా మాత్రమే ప్రచారం చేశామని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరైనా ఈ కార్యక్రమానికి హాజరుకావచ్చని చెప్పామని... దీంతో మాల్యా ఈ కార్యక్రమానికి వచ్చారని, ప్రేక్షకుల్లో కూర్చుని కార్యక్రమాన్ని చూశారని ట్వీట్‌ చేశారు.

విజయ్ మాల్యా ప్రేక్షకుల్లో ఉండడాన్ని చూసిన బ్రిటిష్ భారత హై కమిషనర్ నవతేజ్ సర్నా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో Q&A పూర్తికాకముందే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మధ్యలోనే వెళ్లిపోయారని సేథ్ పేర్కొన్నారు. కింగ్‌ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను స్థాపించి బ్యాంకులకు రూ. 9 వేల కోట్లు రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమైన మాల్యా భారత్‌లో విచారణను ఎదుర్కొంటున్నారు.

ఇంటర్ పోల్ సాయంతో మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు ఇప్పించే దిశగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయ్ మాల్యా పాస్ పోర్టును భారత విదేశాంగ శాఖ సీజ్ చేసింది.

English summary
Business tycoon Vijay Mallya, who was last week declared a proclaimed offender by court in Mumbai in a money laundering case, was seen at a book launch event in London on Thursday that was attended by the Indian envoy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X