వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లంకలో భారతీయులకు హైకమిషన్ హెచ్చరికలు-దౌత్యాధికారిపై దాడితో అప్రమత్తం

|
Google Oneindia TeluguNews

కొలంబో: శ్రీలంకలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత ప్రభుత్వ సీనియర్ అధికారి అనూహ్య దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడ భారతీయుల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. ఈ నేపథ్యంలో లంకలో తాజా పరిణామాల గురించి తెలుసుకోవాలని, తదనుగుణంగా వారి కదలికలు, కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాలని భారత హైకమిషన్
తమ పౌరుల్ని కోరింది.

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా దేశంలో రాజకీయ గందరగోళం నెలకొంది. దీంతో శ్రీలంక ప్రజలు నిరసనలకు దిగుతున్నారు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు బుధవారం కీలక ఎన్నికలకు ముందు తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అత్యవసర పరిస్థితి కూడా విధించారు. అయినా నిరసనలు సద్దుమణగడం లేదు. భారత్, శ్రీలంక ప్రజల మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నాయని భారత హైకమిషన్ ఒక ట్వీట్‌లో పేర్కొంది. అయితే తాజాగా ఓ భారత అధికారిపై దాడి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండమని కోరింది.

indian high commission issued advisory in sri lanka after senior official injured

"ప్రస్తుత పరిస్థితిలో, శ్రీలంకలోని భారత జాతీయులు తాజా పరిణామాల గురించి తెలుసుకోవాలని, తదనుగుణంగా వారి కదలికలు, కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాలని హై కమిషన్ కోరుతోంది. అవసరమైనప్పుడు మీరు మమ్మల్ని సంప్రదించవచ్చని కూడా తెలిపింది. మరొక ట్వీట్‌లో, హైకమిషన్ ఉదయం తన అధికారులు "కొలంబో సమీపంలో గత రాత్రి అనూహ్యమైన దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ వీసా సెంటర్ డైరెక్టర్ వివేక్ వర్మని కలిశారని చెప్పారు.
ఈ విషయాన్ని శ్రీలంక అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపింది.

English summary
after attack on indian official, indian high commission has issued advisory to indians in sri lanka
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X