వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మతిమరుపు: భారతీయుడ్ని ఫేస్‌బుక్ కలిపింది

By Pratap
|
Google Oneindia TeluguNews

Facebook
దుబాయ్: మెదడులో కణతి కారణంగా మతిమరుపుతో బాధపడుతున్న ఓ భారతీయుడిని ఫేస్‌బుక్ వల్ల గుర్తు పట్టగలిగారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలోని భారత రాయబార కార్యాలయం వద్ద అతను స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. తమిళనాడులోని విల్లీపురానికి చెందిన దనగైవేల్ గుణశేఖరన్ అనే ఆ వ్యక్తి ఫొటోను కొన్ని తమిళ సంస్థలు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాయి.

దాదాపు 8 వేల మంది అతడి ఫొటోను షేర్ చేసారు. దీంతో ఎట్టకేలకు అతన్ని గుర్తుపట్టగలిగారు. అక్టోబర్‌లో గుణశేఖరన్‌ను గమనించిన రాయబార కార్యాలయం అధికారులను అతడ్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే అతని మెదడులో కణతి ఉందని, మతిమరుపుతో బాధపడుతున్నాడని గుర్తించారు. దీంతో అతడు ఎవరనేది భారత రాయబార కార్యాలయానికి అంతు చిక్కలేదు.

సౌదీ ప్రభుత్వం క్షమాభిక్, పథకం అమలులో ఉన్నా గుణశేఖరన్‌కు ఏమీ తెలియకపోవడంతో ఎవరూ ఏమీ చేయలేకపోయారు. దీంతో భారత రాయబార కార్యాలయ వర్గాలు తమిళ సంఘాలను సంప్రదించింది. దీంతో ఓ సంస్థ ఫేస్‌బుక్ ద్వారా అతడి వివరాలు తెలుసుకుంది. అతడి పాస్‌పోర్టు, వీసా కాపీలు అతని భార్య వద్ద ఉన్నాయి. వాటి అధారంగా భారత అధికారులు సంప్రదించారు.

భారత రాయబార కార్యాలయం వాళ్లే అతడి చికిత్స ఖర్చులు భరించారు. గుణశేఖరన్‌ను చెన్నైకి పంపేందుకు ఏర్పాట్లు చేశారు.

English summary

 An Indian man suffering from brain tumor and amnesia has been identified three months after he was found in an unconscious state in front of the Indian Consulate in Jeddah in Saudi Arabia, courtesy Facebook.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X