వామ్మో.. విమానంలోనే ఇద్దరు టీనేజర్లపై భారతీయుడు..
అమెరికాలోని చికాగో నుంచి జర్మనీ వెళ్తున్న విమానంలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ భారతీయుడు.. విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు టీనేజర్లపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. మెటల్ ఫోర్క్ తో ఆ ఇద్దరు టీనేజర్లపై దాడి చేశాడు. అంతేకాక విమానంలోని మరో ప్రయాణికుడిపై దాడి చేశాడు. చికాగో నుంచి జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ కు బయల్దేరిన లుఫ్తాన్సా విమానంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. అయితే పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసినట్లు సమాచారం. మసాచుసెట్స్ జిల్లా కోర్టుకు అమెరికా అటార్నీ జనరల్ అందిచిన స్టేట్ మెంట్ లో ఈ వివరాలు ఉన్నాయి.
కోర్టు డాక్యుమెంట్స్ ప్రకారం.. ప్రణీత్ కుమార్ ఉసిరిపల్లి(28) అనే భారతీయుడు.. చికాగో నుంచి జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ కు బయల్దేరిన విమానంలో ఇద్దరు టీనేజర్లపై దాడికి పాల్పడ్డాడు. తన దగ్గరున్న మెటల్ ఫోర్క్ తో 17 ఏళ్ల టీనేజర్ భుజంపై పొడిచాడు. అలాగే పక్కనే ఉన్న మరో 17 ఏళ్ల టీనేజర్ తల వెనుక పొడిచాడు. అడొచ్చిన విమానంలోని ఓ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. పక్కనే ఉన్న ఓ మహిళా ప్యాసింజర్ పై దాడికి పాల్పడ్డాడు. మరో ప్రయాణికుడినీ కొట్టబోయాడు.

విమానం ప్రయాణిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని బోస్టన్ లోగాన్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టుకు మళ్లించి అక్కడే ల్యాండింగ్ చేశాడు. అక్కడి పోలీసులు ప్రణీత్ ను కస్టడీలోకి తీసుకున్నారు. ప్రణీత్ స్టూడెంట్ వీసాతో అమెరికాలోకి వచ్చినట్లు గుర్తించారు. ప్రణీత్ ను వెంటనే స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రణీత్ కుమార్ ప్రమాద కరమైన ఆయుధంతో ఇద్దరు టీనేజర్లపై దాడికి పాల్పడినట్లు వివరించారు. ఈ నేరం రుజువైతే ప్రణీత్ కు గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షతోపాటుగా 2,50,000 డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మసాచుసెట్స్ జిల్లా కోర్టుకు అమెరికా అటార్నీ జనరల్ అందిచిన స్టేట్ మెంట్ లో ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరిచారు. ఈ ఘటన అక్టోబర్ 25 న జరిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications