భారత సంతతి విద్యావేత్తలకు అత్యున్నత పురస్కారాలు

సియోల్‌లో జరిగిన ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మేథమేటీషియన్స్‌లో ఇంటర్నేషనల్ మేథమెటికల్ యూనియన్ (ఐఎంయూ) ఈ బహుమతులను అందజేసింది. ఫీల్డ్స్ మెడల్ సాధించిన మంజుల్ భార్గవ అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో ఫ్రెఫెసర్‌గా పని చేస్తున్నారు. కొత్త గణిత సూత్రాలను అభివృద్ధి చేసినందుకు భార్గవకు ఈ బహుమతి దక్కింది. భార్గవతోపాటు మరో ముగ్గురు ఈ బహుమతిని గెలుచుకున్నారు.
ఇరాన్‌కు చెందిన ప్రొఫెసర్ మరియం మీర్జఖని ఈ బహుమతి గెలుచుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఈమె స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
రోల్ఫ్ నెవాన్ లిన్నా బహుమతిని గెలుచుకున్న సుభాష్ ఖోట్ న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన కౌరంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ సైన్సెస్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.












Click it and Unblock the Notifications