చెంఘీజ్ ఖాన్ వీడియో చూశాడని ఇండియన్ అరెస్ట్
బీజింగ్: చైనాలో నిషేధిత చెంఘీజ్‌ఖాన్ సినిమా చూశాడని, దీంతో ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో వారం క్రితం అరెస్టయిన భారతీయ వ్యాపారి రాజీవ్‌మోహన్ కుల్‌శ్రేష్ఠ విడుదలయ్యారు. భారత రాయబార వర్గాల జోక్యంతో రాజీవ్‌పై మోపిన అభియోగాలను చైనా ఉపసంహరించుకుంది.
ఈ మేరకు శనివారం ఆయనను భారత్ తరలించారు. ఓ దక్షిణాఫ్రికా సంస్థ ప్రకటించిన ఆఫర్‌తో మరో 19మంది విదేశీయులతో కలిసి ఢిల్లీ వాసి రాజీవ్‌మోహన్ జులై 10న చైనాలోని మంగోలియా ప్రావిన్స్‌లోగల ఆర్డోస్ పట్టణానికి వెళ్లాడు.

అక్కడ ఓ హోటల్ గదిలో నిషేధిత చెంఘీజ్‌ఖాన్ సినిమాను చూస్తుండగా.. చైనా అధికారులు అరెస్టు చేశారు. నిషేధిత ఉగ్రవాద గ్రూపులకు చెందిన వీడియోలు చూస్తున్నారని అతడిపై నేరాభియోగాలు మోపారు.
అనంతరం రోడ్డుమార్గంలో 920 కిలోమీటర్ల దూరం ఉన్న బీజింగ్‌కు తరలించారు. అప్పటికే విషయం తెలుసుకుని చైనాలోని భారత రాయబారి అశోక్ కే కంథా చైనా అధికారులతో సంప్రదింపులు జరిపారు. దీంతో రాజీవ్ శనివారం బీజింగ్ చేరుకోగానే, ఆయన్ను భారత్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications