పాకిస్తాన్ కు భారత్ మరో బిగ్ షాక్- క్రికెటర్ షోయబ్ అక్తర్ కూ..!

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య మాటలయుద్ధం ముదురుతోంది. అదే సమయంలో పాకిస్తాన్ పై కేంద్రం వరుస చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పాకిస్తాన్ పౌరులందరినీ దేశం నుంచి బహిష్కరించడంతో పాటు సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. ఇదే క్రమంలో ఇప్పుడు మరో షాకిచ్చింది. ఇందులో పాకిస్థానీ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూ షాక్ తగిలింది.

పహల్గాం దాడి తర్వాత బహిరంగంగా జరుగుతున్న ఇరుదేశాల మాటల యుద్దంతో పాటు సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ ఛానల్స్ లోనూ ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లను భారత్ లో ప్రసారం కాకుండా నిషేధం విధించింది. ఇందులో క్రికెటర్ షోయబ్ అక్తర్ కు చెందిన ఛానల్ కూడా ఉంది. పహల్గాం దాడిపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నందున వీటిపై నిషేధం విధించింది.

india s another shocker to Pakistan banned 16 youtube channels including cricketer shoiab akhtar s

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత రెచ్చగొట్టే,మతపరంగా సున్నితమైన కంటెంట్‌ను వ్యాప్తి చేయడం, భారత దేశంతో పాటు దాని సైన్యం, భద్రతా సంస్థలపై తప్పుదారి పట్టించే కథనాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న డాన్ న్యూస్, సమా టీవీ, ఆరీ న్యూస్, జియో న్యూస్ వంటి కొన్ని ప్రముఖ ఛానెల్‌లతో సహా 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్‌లను కేంద్రం నిషేధించింది. కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ 16 ఛానెళ్లకు కలిపి 63.08 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు.

ఈ ఛానెల్స్ ను ఓపెన్ చేస్తే "జాతీయ భద్రత లేదా ప్రజా క్రమానికి సంబంధించిన ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశం కారణంగా ఈ కంటెంట్ ప్రస్తుతం ఈ దేశంలో అందుబాటులో లేదు. ప్రభుత్వ తొలగింపు అభ్యర్థనల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి గూగుల్ ను సందర్శించడి అని మెసేజ్ వస్తోంది. ఇవాళ భారత ప్రభుత్వం నిలిపివేసిన యూట్యూబ్ ఛానల్స్ లో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తన పేరుతోనే నడుపుతున్న ఛానల్ కూడా ఉంది. దీనికి 38 లక్షల సబ్ స్క్రైబర్లు ఉన్నారు. క్రికెట్ కంటెంట్ కోసం ఏర్పాటు చేసిన ఈ ఛానల్ బ్యాన్ పై చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+