Indian Passport: అంతర్జాతీయ ర్యాంకుల్లో భారత పాస్ పోర్ట్ మరింత పతనం..!

ఈ మధ్య ఎక్కడ చూసినా చర్చనీయాంశంగా మారిన భారత పాస్ పోర్టుకు (indian passport) మరో షాక్ తగిలింది. తాజాగా పాస్ పోర్టు ఉన్నా భారతీయ పౌరసత్వం ఉన్నట్లు కాదని కేంద్రం తేల్చేయడంతో దెబ్బతిన్న పాస్ పోర్టు పరపతికి ఇవాళ మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ పాస్ పోర్ట్ ర్యాంకింగ్స్ ఇచ్చే హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ లో భారత పాస్ పోర్టు మరింత పతనమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అంతర్జాతీయంగా 75వ స్ధానంలో ఉన్న పాస్ పోర్టు కాస్తా ఇప్పుడు ఆరు స్ధానాలు దిగజారి 81వ ర్యాంక్ కు పడిపోయింది.

ఈ ఏడాది ఆరంభంలో భారత పాస్ పోర్టు ర్యాంక్ మెరుగుపడి 85 స్ధానం నుంచి ఫిబ్రవరి నెలలో 75వ స్ధానానికి చేరుకుంది. అనంతరం మే నెలలో ఇది 78వ ర్యాంక్ కు చేరుకుంది. ఇప్పుడు జూలై నెలకు విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో అది కాస్తా 81వ స్ధానానికి చేరుకుని మరింత పతనం నమోదు చేసుకుంది. తాజా ర్యాంకింగ్ ప్రకారం చూస్తే భారత పాస్‌పోర్ట్ దారులు ప్రపంచవ్యాప్తంగా 55 దేశాలకు వీసా లేకుండా లేదా వీసా-ఆన్-అరైవల్ పద్ధతిలో ప్రయాణించవచ్చు.

India s Passport Ranking Slips to 81 Falls Six Places From Earlier This Year

పాస్ పోర్టుల పరపతిని నిర్ధారించే హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌ను ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా రూపొందిస్తారు. ఇందులో 227 ప్రయాణ గమ్యస్థానాలకు సంబంధించి 199 పాస్‌పోర్ట్‌లను మూల్యాంకనం చేస్తారు. ఈసారి ఇచ్చిన ర్యాంకింగ్స్ లో సింగపూర్ పాస్‌పోర్ట్‌తో 192 గమ్యస్థానాలకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తూ అగ్రస్థానంలో కొనసాగుతోంది. జపాన్ , దక్షిణ కొరియా రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి. ఇప్పుడు వాటితో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా చేరింది. అమెరికా ఇందులో 10వ స్థానానికి పడిపోయింది. దాని పాస్‌పోర్ట్ 180 గమ్యస్థానాలకు ప్రవేశాన్ని అందిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+