వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలి సమీపంలో కాంటాక్ట్ కోల్పోయిన ఇండోనేషియా నేవీ సబ్‌మెరైన్, 53 మంది..

|
Google Oneindia TeluguNews

జకార్తా: ఇండోనేషియా నేవీకి చెందిన ఓ సబ్‌మెరైన్(జలాంతర్గామి) బాలి సమీపంలో అదృశ్యమైంది. ఆ జలాంతర్గామిలో 53 మంది ఉన్నట్లు ఇండోనేషియా మిలిటరీ వెల్లడించింది.

కేఆర్ఐ నంఘాలా 402 శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటోందని, అయితే, షెడ్యూల్ రిపోర్ట్ చేయాల్సి ఉండగా, అందుబాటులోకి రాలేదని మిలిటరీ చీఫ్ హడి తజ్జాంటో తెలిపారు.బాలీకి ఉత్తరాన 95 కిలోమీటర్ల దూరంలో ఆ జలాంతర్గామి అదృశ్యమైందని చెప్పారు.సబ్‌మెరైన్‌ను వెతికేందుకు ఇప్పటికే నౌకలు బయల్దేరాయని తజ్జాంటో తెలిపారు. జలాంతర్గామిని వెతికేందుకు సబ్‌మెరైన్ వెస్సెల్స్ కలిగివున్న సింగపూర్, ఆస్ట్రేలియా సాయాన్ని కోరినట్లు చెప్పారు.

700 మీటర్ల లోతులో జలాంతర్గామి మునిగిపోయిందని నావికాదళం నమ్ముతున్నట్లు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. అది ఎందుకు తప్పిపోయిందనే దానిపై తక్షణ సమాచారం లేదు.

 Indonesian Navy loses contact with submarine near Bali

జర్మనీలో నిర్మించిన ఈ జలాంతర్గామి.. 1980 తొలినాళ్ల నుంచి సేవలందిస్తోంది. ఇక గురువారం జరగబోయే క్షిపణి కాల్పుల ఎక్సర్సైజ్ కోసం రిహార్సల్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి తజ్జాంటో, ఇతర సైనిక నాయకులు హాజరుకావలసి ఉంది.

ఇండోనేషియాలో ప్రస్తుతం ఐదు జలాంతర్గాములు ఉన్నాయి, 2024 నాటికి కనీసం ఎనిమిదింటిని ఆపరేట్ చేయాలని యోచిస్తోంది.

Recommended Video

Indonesia Earthquake : ఇండోనేషియాలో భారీ భూకంపం.. 6.2 తీవ్రతతో ప్రకంపనాలు...!!

నేచునా దీవులకు సమీపంలో చైనా నౌకలతో సంబంధం ఉన్న అనేక సంఘటనలతో సహా, ఇటీవలి కాలంలో ఇండోనేషియా దేశం తన సముద్ర వాదనలకు పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కొంటోంది.

English summary
Indonesia's navy is searching for a submarine that went missing north of Bali with 53 people on board, the military says.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X