వెనిజులాకు ఉన్న సైన్యం ఎంత ? అమెరికాతో యుద్ధం చేయగలదా ??
వెనిజులా - అమెరికా వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అమెరికా చేపట్టిన సైనిక చర్య ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. వెనిజులా రాజధాని కరాకస్‌పై 'ఆపరేషన్ అబ్‌సొల్యూట్ రిసాల్వ్' పేరుతో దాడి చేసిన అనంతరం ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టు చేసి న్యూయార్క్‌కు తరలించారు. వెనెజులా ప్రస్తుతానికి తమ నియంత్రణలో ఉంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే కొత్త అధ్యక్షుడిని నియమిస్తామనీ పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే అమెరికా-వెనిజులా మధ్య రాజకీయ, దౌత్య, సైనిక ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. చమురు వనరులు, ప్రజాస్వామ్య పాలన, మానవ హక్కుల అంశాలపై రెండు దేశాల మధ్య విభేదాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. తాజాగా తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు ఈ వివాదాన్ని మరింత ముదుర్చుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా-వెనిజులా సంబంధాలు ఎటు దారితీస్తాయన్న అంశం అంతర్జాతీయంగా చర్చకు వస్తోంది. ఈ ఉద్రిక్తతల మధ్యలోనే ఈ ఘటన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచి.. సైనిక స్థాయి ఘర్షణలపై చర్చను తెరపైకి తీసుకొస్తున్నాయి.

వెనిజులా సైన్యం బలం..
ఈ పరిస్థితుల్లో వెనిజులా అమెరికా వంటి ప్రపంచ అగ్రశక్తిని సైనికంగా ఎదుర్కోగలదా అనే ప్రశ్న తలెత్తుతోంది. మానవశక్తి, ఆయుధ సామర్థ్యం, సాంకేతికత, వైమానిక-నావికా బలగాలు, రక్షణ బడ్జెట్ వంటి అంశాల ఆధారంగా రెండు దేశాల సైనిక శక్తిని పోల్చి చూడాల్సిన అవసరం ఏర్పడింది. కాగా వెనిజులా సైన్యాన్ని "నేషనల్ బొలివేరియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (FANB)"గా పిలుస్తారు. దేశ రక్షణ, ప్రభుత్వ స్థిరత్వాన్ని కాపాడటమే దీని ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం సుమారు 1.9 లక్షల క్రియాశీల సైనికులు ఉండగా, రిజర్వ్, మిలీషియా, పారామిలిటరీ దళాలతో కలిపితే మొత్తం బలం 2.2 లక్షల వరకు ఉంటుందని అంచనా.
అలానే వెనిజులా వైమానిక దళంలో ప్రధానంగా రష్యన్ తయారీ Su-30MK2 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇవి శక్తివంతమైనవైనా, అమెరికా వద్ద ఉన్న స్టెల్త్ ఫైటర్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్‌ను ఎదుర్కోవడంలో బలహీనంగా మారతాయి. విడి భాగాల కొరత, నిర్వహణ సమస్యలు కూడా పెద్ద సవాలుగా ఉన్నాయి. భూ బలగాల్లో సుమారు 8,800 సాయుధ వాహనాలు ఉన్నప్పటికీ, ఆధునిక ట్యాంకులు కేవలం 170-200 మధ్యే ఉన్నాయి. నావికా దళం తీరప్రాంత భద్రతకే పరిమితం కాగా, భారీ యుద్ధనౌకలు, అణు సబ్‌మెరీన్లు లేవు. దీంతో సముద్రంలో అమెరికాను ఎదుర్కొనే స్థాయి వెనిజులాకు లేదు. అంతే కాకుండా వెనిజులా రక్షణ బడ్జెట్ సంవత్సరానికి 4-5 బిలియన్ డాలర్లలోపే ఉంది. దేశంలోని తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా ఆధునిక ఆయుధాలు, శిక్షణ, సాంకేతిక అభివృద్ధికి ఇది పెద్ద అడ్డంకిగా మారింది.
మరోవైపు అమెరికా సైన్యం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా గుర్తింపు పొందింది. 13 లక్షల క్రియాశీల సైనికులు, రిజర్వ్ మరియు నేషనల్ గార్డ్‌లతో కలిపితే మరో 8 లక్షల మంది అందుబాటులో ఉంటారు. ఇది వెనిజులా సైనిక బలానికి అనేక రెట్లు అధికం. అమెరికా వద్ద F-22, F-35 స్టెల్త్ ఫైటర్లు, 13,000కు పైగా యుద్ధ విమానాలు, 11 అణు విమాన వాహక నౌకలు, అణు సబ్‌మెరీన్లు ఉన్నాయి. అంతేకాకుండా అణ్వాయుధాలు, సైబర్, అంతరిక్ష యుద్ధ సామర్థ్యాలు కూడా అమెరికాను అజేయంగా నిలబెడుతున్నాయి.
మొత్తంగా రెండు దేశాల సైనిక శక్తిని పోల్చితే, ప్రతి విభాగంలోనూ అమెరికా స్పష్టమైన ఆధిపత్యాన్ని కలిగి ఉందని తెలుస్తోంది. ప్రత్యక్ష యుద్ధం జరిగితే వెనిజులాకు నిలబడే అవకాశాలు చాలా తక్కువని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గెరిల్లా యుద్ధం, మిలీషియా దళాల ద్వారా తాత్కాలిక ప్రతిఘటన సాధ్యమైనా, దీర్ఘకాలంలో అమెరికా సైన్యాన్ని ఎదుర్కోవడం వెనిజులాకు దాదాపు అసాధ్యమేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
-
అమెరికా F-35 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. -
ఇరాన్ పై తప్పిన లెక్కలు-ట్రంప్ వన్నీ అబద్ధాలే-జో కెంట్ షాకింగ్..! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications