వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్ పోల్ చీఫ్ మెంగ్ హంగ్‌వెయ్ రాజీనామా, ఎన్నో ట్విస్ట్‌లు

|
Google Oneindia TeluguNews

బీజింగ్: అంతర్జాతీయ నేర పోలీసుల విభాగం (ఇంటర్ పోల్) అధ్యక్షులు మెంగ్ హంగ్‌వెయ్ తన పదవికి రాజీనామా చేశారు. చైనా పోలీసుల ఆదీనంలో ఉన్నారు. ఆదివారం ఆయన రాజీనామా లేఖ అందినట్లు అధికారులు తెలిపారు. చైనా నిర్బంధంలో ఉండటంతో మెంగ్ రాజీనామా చేశారని చెప్పారు.

<strong>అమెరికాలో దూసుకెళ్తున్న తెలుగువాళ్లు: ఏడేళ్లలో ఎంతంటే? 5పెద్ద నగరాల్లో సగం వీళ్లే! ఆసక్తికర అంశాలు</strong>అమెరికాలో దూసుకెళ్తున్న తెలుగువాళ్లు: ఏడేళ్లలో ఎంతంటే? 5పెద్ద నగరాల్లో సగం వీళ్లే! ఆసక్తికర అంశాలు

ఆయన స్థానంలో ఉత్తర కొరియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కిమ్ జోంగా యాంగ్ ఇంటర్ పోల్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. మెంగ్ హంగ్‌వెయ్ గత నెల 25వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఆ తర్వాత భార్యకు వివిధ రూపాల్లో సందేశాలు అందాయి. వేచి ఉండాలని ఓసారి, కాల్ కోసం వేచి చూడాలని మరోసారి, కత్తిని సూచించే ఎమోజీ మరోసారి ఆయన భార్యకు వెళ్లింది.

 Interpol chief resigns amid detention in China

దీంతో తన భర్త ప్రమాదంలో ఉన్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత 29వ తేదీన ఫ్రాన్సులో కనిపించారు. ఆ తర్వాత తిరిగి తన దేశమైన చైనాకు చేరుకున్నారని ఫ్రాన్స్ తెలిపింది. కానీ చైనా పోలీసులు ఆయనను ఏ విషయమై విచారిస్తున్నారో తెలియలేదు.

అయితే దర్యాఫ్తులో భాగంగా చైనా అధికారులు అతనిని విచారిస్తున్నారు. గత వారం ఆయన చైనాకు చేరుకోగానే క్రమశిక్షణ విభాగం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మెంగ్ ఇంటర్ పోల్ అధ్యక్షుడే కాకుండా చైనాలో ప్రజా భద్రత విభాగంలో ఉపమంత్రి. మెంగ్ రాజీనామా మినహా ఆయనకు సంబంధించిన ఏ అంశం బయటకు రావడం లేదు. కాగా, అతను లంచం, అవినీతి కేసులో చైనా అధికారుల ఆధీనంలో ఉన్నారని తెలుస్తోంది.

English summary
Former Interpol chief Meng Hongwei has been detained in China on bribery and corruption charges, the country's public security ministry said 13 days after he went missing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X