జపాన్ తీరంలో భారీ సైజు వింత బంతి ? చైనా బెలూన్ల నిఘా వేళ కలకలం..
జపాన్ లోని ఎన్షూ బీచ్ లో తాజాగా ఓ భారీ సైజు వింత బంతి కనిపించింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియలేదు. సముద్రం నుంచి కొట్టుకొచ్చినట్లు మాత్రం కనిపించడం లేదు. దీంతో ఈ బంతి దగ్గరికి వెళ్లేందుకు ప్రజల్ని అనుమతించడం లేదు. బీచ్ ను సైతం మూసేసిన పోలీసులు.. నిపుణుల్ని పిలిపించి దర్యాప్తు ప్రారంభించారు.
జపాన్‌లోని ఎన్షూ బీచ్‌లో లోహంతో తయారు చేసినట్లుగా ఉన్న భారీ బంతి కొట్టుకువచ్చిందని..దానిని పరిశోధించేందుకు ఆ ప్రాంతం మూసేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. హమామత్సు నగరంలోని ఎన్‌షు బీచ్‌లో స్థానిక మహిళ ఈ వింత బంతిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. ఈ వింత బంతి సుమారు 1.5 మీటర్ల వ్యాసం కలిగి ఉన్నట్లు గురించారు. అలాగే తుప్పు పట్టినట్లు కనిపిస్తోంది. కాబట్టి ఇది ఇనుముతో తయారు చేసినట్లు భావిస్తున్నారు. ఇందులో హ్యాండిల్ లాంటి లోహపు ముక్కలు కూడా ఉన్నాయి.

Strange body found on the shores in Japan! pic.twitter.com/DCPGREErCy
— Ashraf El Zarka (@aelzarka) February 21, 2023












Click it and Unblock the Notifications