Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Salman Rushdie : సల్మాన్ రష్డీపై దాడి వెనుక కారణమిదే ! ఎట్టకేలకు నోరు విప్పిన ఇరాన్

భారత సంతతికి చెందిన నవలా రచయిత, బుకర్ ప్రైజ్ గ్రహీత సల్మాన్ రష్డీపై జరిగిన దాడిలో హస్తం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాన్ ఎట్టకేలకు ఇవాళ స్పందించింది. సల్మాన్ రష్డీ రాసిన శాటానిక్ వర్సెస్ పుస్తకాన్ని గతంలో నిషేధించడంతో పాటు ఆయన తలకు వెలకట్టిన ఇరాన్.. ఇప్పుడు ఆయనపై దాడి వెనుక ఉండి ఉంటుందనే ప్రచారం అంతర్జాతీయంగా జరుగుతోంది. దీనిపై ఇవాళ ఆ దేశం స్పందించింది.

సల్మాన్ రష్డీపై దాడిలో తమ దేశం ప్రమేయం ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఈ దాడి విషయంలో నిందించాల్సింది సల్మాన్‌ రష్డీ, ఆయన మద్దతుదారులనేనని ఇరాన్‌ విదేశాంగ శాఖ ఓ ప్రకటన లో తెలిపింది. వాక్ స్వాతంత్ర్యం తన రచనలో ఒక మతానికి వ్యతిరేకంగా రష్దీ చేసిన అవమానాలను ఎంత మాత్రం సమర్థించదని ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి నాజర్‌ కన్నాని తెలిపారు. ఇస్లామిక్ పవిత్రతను అవమానించడం ద్వారా ఆయన కోట్ల మంది ఇస్లాం సమాజం నుంచి వ్యతిరేకతను మూటగట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు. కాబట్టి దాడికి ఆయన్ని, ఆయన అనుచరులను తప్ప ఎవరినీ నిందించలేమన్నారు.

iran finally reacted on salman rushdie attack- says him and supporters to blame for this

అలాగే సల్మాన్‌ రష్డీపై దాడికి పాల్పడ్డ నిందితుడు హాది మతార్‌ గురించి మీడియాలో చూడడమే తప్ప, అతని గురించి తమకెలాంటి సమాచారం లేదని ఇరాన్‌ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. 1998లో రష్డీ రాసిన ది సాటానిక్ వెర్సెస్ నవల ఇస్లాంకు వ్యతిరేకంగా ఉండడం, ఆ నిషేధిత నవలపై ఆగ్రహం వెల్లగక్కిన అప్పటి ఇరాన్‌ అధినేత అయతొల్లా రుహుల్లా ఖోమెనీ ఆయనకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారు. రష్డీని చంపిన వాళ్లకు భారీ రివార్డు ప్రకటించారు. ఆ భయంతో దాదాపు చాలా ఏళ్లు సల్మాన్‌ రష్డీ అజ్ఞాతవాసంలోనే ఉండిపోయారు. తాజాగా అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు వెళ్లిన ఆయనపై నిందితుడు హాదీ మతార్‌.. పదునైన ఆయుధంతో దాడి చేశాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+