హార్మూజ్ జలసంధిని 7 రోజుల్లో ఓపెన్ చేస్తాం.. కానీ: ఇరాన్ కీలక ప్రకటన
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్- అమెరికా యుద్ధంతోపాటు అటు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్ ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే హార్మూజ్ జలసంధిపై ఇరాన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. తాము ఏడు రోజుల్లో హార్మూజ్ జలసంధిని రీ ఓపెన్ చేస్తామని కానీ హార్మూజ్ లో అమెరికా సైన్యం వెనక్కు వెళ్లాలని.. అలాగే ఇరాన్ పోర్టుల్లో బ్లాకేడ్ ను తొలగించాలని విజ్ఞప్తి చేసింది. రాయిటర్స్ అండ్ జపాన్ కు చెందిన క్యోడో న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం ఇరాన్ ఈ మేరకు విజ్ఞప్తి చేసింది.
ఇరాన్ కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపిన వివరాలను రాయిటర్స్, క్యోడో న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు అవసరమైన షరతులను టెహ్రాన్ నిర్దేశించిందని అలాగే మిడిల్ ఈస్ట్ లో దాదాపు ఏడు నెలల యుద్ధం తర్వాత ఇరాన్ ఆర్థిక పరిస్థితి, ట్రంప్ సర్కార్ దూకుడు తదితర అంశాలను వివరించింది. ఇక ఇటీవలి కాలంలో హార్మూజ్ జలసంధి లక్ష్యంగా ఇరాన్ మిలిటరీపై ట్రంప్ సర్కార్ ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఇరాన్ స్పష్టం చేసింది. అందువల్లే అమెరికా మిలిటరీ హార్మూజ్ ను వీడాలని అప్పుడే ఆ జలసంధిని ఓపెన్ చేస్తామని కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా సముద్రాల మార్గం గుండా జరిగే మొత్తం చమురు రవాణాలో దాదాపు 20 నుంచి 30 శాతం వరకు హార్మూజ్ జలసంధి గుండానే సాగుతుంది.

హార్మూజ్ జలసంధి నుంచి వెళ్లే అత్యధిక శాతం అంటే దాదాపు 80 శాతానికి పైగా చమురు ఆసియా దేశాలకే వెళ్తుంది. ముఖ్యంగా భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు తమ ఇంధన అవసరాల కోసం హార్మూజ్ జలసంధిపైనే అధికంగా ఆధారపడుతుంటాయి. ఇదిలా ఉంటే సౌదీ అరేబియా- హౌతీ రెబల్స్ మధ్య ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. తాజాగా బాబ్ అల్ మండేబ్ సమీపంలోని ఓ స్థానిక మార్కెట్ ను లక్ష్యంగా చేసుకుని సౌదీ అరేబియా వైమానిక దాడి జరిపిందని హూతీ దళాలు పేర్కొన్నాయి. అంతకుముందు హౌతీ దళాలు.. సౌదీ అరేబియా రియాద్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పై దాడులు చేపట్టిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
