అమెరికాపై విరుచుకుపడ్డ ఇరాన్: ఎయిర్‌బేస్‌పై మిస్సైళ్లతో దాడి: ఏం జరుగుతోంది?

Joe Biden: మధ్య ఆసియా దేశాల్లో యుద్ధ మేఘాలు అలముకున్నాయి. ఇప్పటికే యెమెన్‌‌పై దాడికి దిగింది అగ్రరాజ్యం అమెరికా. హౌతి తిరుగుబాటుదారుల స్థావరాలపై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. బ్రిటన్ సహా వివిధ దేశాల సహకారంతో ఈ దాడులకు పూనుకుంది. సముద్ర మార్గాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న హౌతి రెబెల్స్‌పై ప్రతీకారాన్ని తీర్చుకుంటోంది.

ఈ క్రమంలో అమెరికాపై దాడులకు సిద్ధపడింది ఇరాన్. ఇరాక్‌లో ఉన్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయ భవనంపై బాలిస్టిక్స్ మిస్సైళ్లను సంధించింది. ఇరాక్ ఉత్తరప్రాంతంలోని ఎర్బిల్ సిటీలో ఉంటుంది యూఎస్ కాన్సులేట్. దీన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఆరు మంది తీవ్రంగా గాయపడ్డారు.

Iran militants launch ballistic missiles at US airbase in Iraq

ఈ దాడులకు తామే కారణమని ఇరానియన్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. దాడి చేయడానికి గల కారణాన్ని వెల్లడించింది. ఎర్బిల్‌లోని అమెరికన్ కాన్సులేట్.. గూఢచర్య కార్యకలాపాలకు కేంద్రబిందువుగా మారిందని ఆరోపించింది. తమకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాల మద్దతును అమెరికా కూడగట్టుకుంటోందని పేర్కొంది.

దీనకి ప్రతీకార దాడికి దిగారు ఇరాన్ మిలిటెంట్లు. ఇరాక్‌లోని అమెరికా ఎయిర్ బేస్‌పై ఏకంగా బాలిస్టిక్స్ మిస్సైళ్లను సంధించారు. ఈ ఘటనలో అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని అమెరికా రక్షణ విభాగం ప్రధాన కార్యాలయం పెంటగాన్ ధృవీకరించింది. సైనికులు గాయపడినట్లు అధికారికంగా వెల్లడించింది.

ఇరాక్ పశ్చిమ ప్రాంతంలోని అల్- అసద్‌లో ఉంటుంది అమెరికన్ ఎయిర్ బేస్. ఆ దేశ కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు ఈ దాడి చోటు చేసుకుంది. ఇరాన్ మిలిటెంట్లు తమ ఎయిర్ బేస్‌పై మిస్సైళ్లను సంధించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్‌కామ్ తెలిపింది. ఈ దాడి వెనుక ఇరాన్ మిలిటెంట్ గ్రూపులు ఉన్నట్లు అనుమానిస్తున్నామని పేర్కొంది.

ఈ దాడి తీవ్రత ఎంత అనే విషయంపై ఆరా తీస్తోన్నట్లు సెంట్‌కామ్ పేర్కొంది. నష్టాన్ని అంచనా వేస్తోన్నట్లు వివరించింది. పలువరు సైనికులకు ట్రామిక్ బ్రెయిన్ ఇంజ్యురీ అయిందని స్పష్టం చేసింది. ఓ ఇరాక్ ఉద్యోగి గాయపడినట్లు తెలిపింది. ఈ ఘటనపై వైట్ హౌస్ స్పందించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+