F-35 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్.. అమెరికాలో చేయి దాటిన పరిస్థితి!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య నెల రోజులకు పైగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా అమెరికాకు చెందిన F-35 ఫైటర్ జెట్ ను ఇరాన్ పేల్చేసింది. తమ భూభాగంలోకి వచ్చిన అమెరికా యుద్ధవిమానాన్ని తమ సైన్యం పేల్చేసినట్లు ఈ మేరకు ఇరాన్ తాజాగా ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ ఇప్పటి వరకూ రెండు F-35 ఫైటర్ జెట్ లను కూల్చి వేయడం ఆందోళనకరంగా మారింది.

ఇక ఇజ్రాయెల్ పైన ఇరాన్ శుక్రవారం మరోసారి దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ మీడియా ధృవీకరించింది. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ భూభాగం వైపునకు వస్తున్న మిసైల్స్ ను నిర్వీర్యం చేస్తున్నట్లు తెలిపింది. ఇరాన్ క్షిపణులను నాశనం చేసేందుకు డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేసినట్లు పేర్కొంది. అలాగే ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ ఓ ప్రకటనలో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్ లక్ష్యంగా దాడులు చేసినట్లు స్పష్టం చేసింది. అలాగే పోర్ట్ సిటీ అయిలట్ పై లాంగ్ రేంజ్ మిసైల్స్ తో దాడులు చేపట్టినట్లు పేర్కొంది.

మరోవైపు ఎఫ్-35 ఫైటర్ జెట్ ను ఇరాన్ మిలిటరీ పేల్చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం. మార్చి 2 న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీపై కువైట్ సైన్యం జరిపిన ఫ్రెండ్లీ ఫైర్ దాడిలో మూడు ఎఫ్-15ఈ ఫైటర్ జెట్స్ కుప్పకూలాయి. ఇరాన్ ఎయిర్ క్రాఫ్ట్స్, బాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్లతోపాటుగా అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఫైటర్ జెట్స్ ను కువైట్ సైన్యం పేల్చేసిందని అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది.

అలాగే మార్చి 31 న అమెరికా సెంట్రల్ కమాండ్ కు చెందిన కమాండర్ బ్రాడ్ కూపర్ మాట్లాడుతూ.. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో అమెరికా సైన్యం దిగ్విజయంగా పోరాడుతోందని అన్నారు. ఇరాన్ లోని అనేక ప్రాంతాలపై దాడులు చేపట్టామని పేర్కొన్నారు. ఇరాన్ నేవీ, ఎయిర్ వ్యవస్థలపై దాడులు చేశామని స్పష్టం చేశారు. ఇక అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ని ఫిబ్రవరి 28న ప్రారంభించిన విషయం తెలిసిందే.

Iran Shoots Down Another F-35 Fighter Jet as West Asia Tensions Continue to Escalate Iran downs F35

ఇక అమెరికాలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. హార్మూజ్ జలసంధిని తెరవాలని.. సంధి చర్చలకు సహకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పటికే ఇరాన్ కు అనేకసార్లు వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ మాటలను ఇరాన్ లెక్కచేయడం లేదు. అమెరికాలో తాజాగా ఆర్మీ చీఫ్ జనరల్ ను పదవి నుంచి తొలగించారు. దీంతో అగ్రరాజ్యంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+