Iran Vs Israel: సైన్యం, ఆయుధాల్లో ఎవరిది పై చేయి.. ఎవరి బలం ఎంత..!!

ఇరాన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అదే సమయంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులు మొదలు పెట్టింది. రెండు దేశాలు బాంబుల మోతలు.. మిసైల్స్ తో దద్దరిల్లుతున్నాయి. టెహ్రాన్​పై ఇజ్రాయెల్, అమెరికా కలిసి దాడులు చేయగా, ప్రతీగా ఇరాన్​ కూడా స్పందించింది. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్​ వైపు 30 క్షిపణులు దూసుకెళ్లాయి. ఇజ్రాయెల్​పై డ్రోన్లు, క్షిపణుల ప్రయోగించినట్లు ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ వెల్లడించింది. ఈ సమయంలో ఈ రెండు దేశాల సైన్యం.. ఆయుధాల్లో ఏ దేశం బలం ఎంతో చర్చగా మారింది.

ఇజ్రాయెల్‌-ఇరాన్ మధ్య యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్‌, అమెరికా సైనిక దళాలు ఇరాన్‌పై మిస్సైళ్లతో విరుచుకుపడ్డాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ 86 ఏళ్ల ఆయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయాలు లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు కలిసి ఈ దాడులు చేశాయి. ఈ దాడుల పైన ట్రంప్ స్పష్టత ఇచ్చారు. ఇరాన్‌పై మా బలగాలు కూడా దాడులు చేస్తున్నాయని వెల్లడించారు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను తిరిగి చేపడుతోందని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని భద్రతా బలగాలు సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది.

iran-vs-israel-irans-military-is-large-but-israel-relies-on-advanced-technology-and-rapid-mobiliz

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతున్న వేళ, రెండు దేశాల సైనిక సామర్థ్యాలపై చర్చ మొదలైంది. ఈ యుద్దం వేళ అందుతున్న అంచనాల ప్రకారం, ఇరాన్‌కు సుమారు 5 నుంచి 6 లక్షల వరకు క్రియాశీల సైనిక బలం ఉంది. అదనంగా, Islamic Revolutionary Guard Corps (ఇస్లామిక్ విప్లవ రక్షక దళం) కింద సుమారు 1.5 నుంచి 2 లక్షల వరకు ప్రత్యేక బలగాలు ఉన్నట్టు భావిస్తున్నారు.

రెండు దేశాలు ప్రతీకారేచ్ఛతో.. యుద్ధం ఆగేదెలా

దీంతో, మొత్తం కలిపి 7-8 లక్షల మధ్య సైనిక సిబ్బంది ఉన్నట్టు అంచనా. ఇరాన్ వైమానిక దళంలో 1979 విప్లవానికి ముందు కొనుగోలు చేసిన పాత యుద్ధ విమానాలు ఇంకా సర్వీస్‌లో ఉండగా.. ఆ దేశం స్వదేశీ క్షిపణులు, మానవరహిత వైమానిక వాహనాలు (డ్రోన్లు) తయారు చేసే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంది. ఇరాన్ వద్ద వేల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్టు అంచనా. వీటిలో కొన్నివరకు ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకగల దూర పరిధి కలిగి ఉన్నాయని చెబుతున్నారు. కాగా, ఇజ్రాయెల్ సైన్యం పరిమాణంలో చిన్నదైనా, అత్యాధునిక సాంకేతికతతో కూడినదిగా గుర్తింపు పొందింది.

సుమారు 1.7 లక్షల క్రియాశీల సైనికులు, 4 లక్షల వరకు రిజర్వ్ దళాలు ఉన్నట్టు అంచనా. ఇజ్రాయెల్ వైమానిక దళం ప్రధాన బలం. అమెరికా తయారీ F-35 Lightning II (ఎఫ్-35 మెరుపు-2 యుద్ధ విమానం) వంటి అత్యాధునిక గుప్త సామర్థ్య యుద్ధ విమానాలు దళంలో ఉన్నాయి. ఆధునిక ట్యాంకులు, సాయుధ వాహనాలు, సముద్రంలో క్షిపణి నౌకలు, జలాంతర్గాములు కూడా ఇజ్రాయెల్‌కు ఉన్నాయి. అదనంగా, Iron Dome (ఐరన్ డోమ్ వాయు రక్షణ వ్యవస్థ) రాకెట్ దాడులను అడ్డుకునే సామర్థ్యంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇజ్రాయెల్‌కు అమెరికా నుంచి లభిస్తున్న ఆర్థిక, రక్షణ సహకారం కీలక అంశం. దీంతో.. ఈ యుద్దం ఎటువైపు వెళ్తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+