పశ్చిమాసియాలో ఒక్క అమెరికన్ నూ వదిలిపెట్టం..! ఇరాన్ వార్నింగ్..!

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దంలోకి అమెరికా అడుగుపెట్టేసింది. ఇన్నాళ్లూ ఈ యుద్దంలోకి తాను దిగాలా వద్దా అని ఆలోచిస్తున్నట్లు పదే పదే చెప్పిన అమెరికా అధ్యక్షుడు ఎట్టకేలకు ఎంట్రీ ఇచ్చేశారు. ఇరాన్ తో తమ అణుచర్చలు విఫలం కాగానే ఇజ్రాయెల్ వెనుక ఉండి దాడులు చేయిస్తున్న అమెరికా ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది. నిన్న రాత్రి ఇరాన్ లో మూడు అణు స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని భారీ బంకర్ బాంబుల్ని ప్రయోగించింది. దీంతో అమెరికా చర్యపై ఇరాన్ మండిపడుతోంది.

ఇప్పటికే తమ యుద్దంలోకి పశ్చిమ దేశాలు అడుగుపెడితే పశ్చిమాసియాలోని వారి స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించిన ఇరాన్.. ఇప్పుడు అమెరికా తాజా చర్యతో అన్నంత పనీ చేసేందుకు సిద్దమవుతోంది. ఇరాన్ లోని మూడు అణు స్థావరాలు ఫోర్డో, నతాంజ్, ఇస్పాహన్ పై అమెరికా దాడుల్ని ఖండించిన ఇరాన్.. ఇక పశ్చిమాసియాలో ప్రతీ అమెరికన్ పౌరుడ్నీ, సైనికుడినీ లక్ష్యంగా చేసుకుంటామని అధికారిక టెలివిజన్ ద్వారా హెచ్చరించింది.

iran warns every American citizen or military personnel in middle east is a target now

ఇరాన్ పై దాడులతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన దాడులకు తాము ముగింపు పలుకుతామని అధికారిక టెలివిజన్ లో యాంకర్ హెచ్చరించారు. ఇరాన్ గగనతలాన్ని ఉల్లంఘించడం ద్వారా అమెరికా నేరం చేసిందని, పశ్చిమాసియా ప్రాంతంలో దానికి స్థానం లేదని తెలిపారు. మిస్టర్ అమెరికా అధ్యక్షా, మీరే దీన్ని ప్రారంభించారు, మేము దానిని అంతం చేస్తామని ఇరాన్ టెలివిజన్ యాంకర్ వెల్లడించారు. అదే సమయంలో ఆ ప్రాంతంలోని అమెరికా స్థావరాల గ్రాఫిక్స్ ను కూడా ప్రసారం చేశారు.

iran warns every American citizen or military personnel in middle east is a target now

అమెరికాకు పశ్చిమాసియాలో అనేక స్థావరాలు ఉన్నాయి. వాటిలో ఖతార్‌లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరం ఈ ప్రాంతంలో అతిపెద్దది. ఆ తర్వాత బహ్రెయిన్‌లోని యుఎస్ నేవీ ఐదో నౌకాదళం, ఇరాక్‌లోని అల్ అసద్ వైమానిక స్థావరం, హరిర్ వైమానిక స్థావరం, దక్షిణ సిరియాలోని అల్ తన్ఫ్ గారిసన్ సైనిక స్థావరం, కువైట్‌లోని అలీ అల్-సలేం వైమానిక స్థావరం , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అల్ దఫ్రా వైమానిక స్థావరాలున్నాయి. "యుద్ధం ఇప్పుడే మొదలైంది మిస్టర్ ట్రంప్.. ఇప్పుడు మీరు శాంతి గురించి మాట్లాడుతున్నారా? నిర్లక్ష్యం వల్ల కలిగే పరిణామాలను మీరు అర్థం చేసుకునే విధంగా మీకు జవాబిస్తామని మరో ఇరాన్ టీవీలో హెచ్చరికలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+