Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Iran: 600 మందికిపైగా మృతి..?

ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు నిర్వహిస్తోంది. ఇరాన్ పై వరుసగా మూడోరోజు దాడులు కొనసాగుతున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఇరాన్ లో 555 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఇజ్రాయెల్ లో 10 మంది మృతి చెందారు. గల్ఫ్ దేశాల్లో ముగ్గురు అమెరికన్ సైనికులు మృతి చెందారు. ఇక ఇరాన్ సైతం ఇజ్రాయెల్, అలాగే మిడిల్ ఈస్ట్ దేశాల్లోని మిలిటరీ బేస్ లపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది.

ఇరాన్ లోని 31 ప్రావిన్స్ లో 24 ప్రావిన్స్ లపై 1200 వరకు క్షిపణులు, డ్రోన్ లతో దాడులకు పాల్పడినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. మరోవైపు మిడిల్ ఈస్ట్ లోని 27 అమెరికన్ బేస్ లపై దాడులు చేసినట్లు ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవలూషనరీ గార్డ్స్ కార్ప్స్(IRGC) స్పష్టం చేసింది. ఇప్పటివరకూ 9 దేశాలపై ఇరాన్ దాడులకు పాల్పడింది. వీటిలో బహ్రెయిన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ ఉన్నాయి. ఇక సిప్రస్ దేశంలోని యూకే మిలిటరీ బేస్ రన్ వే ఇరాన్ కు చెందిన డ్రోన్ దాడిలో ధ్వంసం అయినట్లు సమాచారం.

IranDeathToll Hits 555 from Israel-US Strikes Combined Casualties Up to 600 in Escalating Conflict

ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో సోమవారం మార్చి 2 నాటికి ఇరాన్ లో 555 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. లెబనాన్ లో 13 మంది మృతి చెందారు. 149 మంది గాయపడ్డారు. ఇరాక్ లో ఒకరు మృతి చెందగా.. 5 గురు గాయపడ్డారు. ఇజ్రాయెల్ లో 10 మంది గాయపడ్డారు. కువైట్ లో ఒకరు మృతి చెందగా 32 మంది గాయపడ్డారు. బహ్రెయిన్ లో ఒకరు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. ఖతార్ లో 16 మంది గాయపడ్డారు. యూఏఈలో ముగ్గురు మృతి చెందగా 58 మంది గాయపడ్డారు. ఇక ఒమన్ లో ఐదుగురు గాయపడ్డారు. అలాగే అమెరికాకు చెందిన సర్వీస్ మెంబర్స్ ముగ్గురు మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు.

ఇక ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఒకదానిపై మరొకటి క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. అయితే ఇరాన్ పై జరిపిన దాడుల్లో సుప్రీ లీడర్ ఖమేనీ మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధృవీకరించింది. అంతేకాక ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడు మరణించినట్లు వెల్లడించింది. అయితే ప్రతీకార దాడులను ఇరాన్ ముమ్మరం చేస్తోంది.

irandeathtoll Hits 555 from Israel-US Strikes Combined Casualties Up to 600 in Escalating Conflict
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+