సెక్స్ స్లేవ్‌గా నో: 250 మంది యువతుల్ని నిలబెట్టి నరికిన ఐసిస్

లండన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ క్రూరత్వానికి మరో నిదర్శనం. తమ వద్ద లైంగిక బానిసలుగా ఉండటానికి నిరాకరించనే ఆగ్రహంతో ఉత్తర ఇరాక్‌లో 250 మంది మహిళలు, బాలికలను ఐసిస్ ఉగ్రవాదులు దారుణంగా చంపేశారు.

ఇరాక్, సిరియాల్లో ఐసిస్ స్వాధీనంలో ఉన్న పలు ప్రాంతాలను తిరిగి ఆక్రమించుకుంటున్న క్రమంలో ఈ తీవ్రవాద సంస్థ చేసిన అరాచకాలు రోజుకొకటి అన్నట్లుగా వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 250 మంది యువతులను నిలబెట్టి నరికి చంపిన ఘటన వెలుగు చూసింది.

ఐసిస్ కిరాతకం: సొంత ఫైటర్లనే చంపేస్తున్నారుఇరాక్‌లోని వివిధ ప్రాంతాల నుంచి పట్టుకొచ్చిన యువతులకు ఐసిస్ తీవ్రవాద సంస్థ పెద్దలు ఓ ఫర్మానా విడుదల చేశారు. దీని ప్రకారం ఐసిస్ తీవ్రవాద సంస్థ తరపున పోరాడుతున్న తీవ్రవాదులను తాత్కాలికంగా పెళ్లి చేసుకుని, సెక్స్ బానిసలుగా పని చేయాలి.

ISIS executes 250 women for refusing to become sex slaves: Report

అయితే, దీనిని ఆ యువతులు వ్యతిరేకించారు. ప్రాణం పోయినా అందుకు అంగీకరించేది లేదన్నారు. దీంతో వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే వారిని తలలు నరికి చంపారని కుర్దిష్ డెమొక్రాటిక్ పార్టీ అధికార ప్రతినిధి సయద్ మముజి తెలిపారు.

తమ పిల్లలను పంపేందుకు అంగీకరించని తల్లిదండ్రులను కూడా ఇదే రకంగా హతమార్చినట్టు ఆయన వెల్లడించారు. ఐసిస్ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆయన తెలిపారు. 2014లో యాజిదికి చెందిన 500 మంది మహిళలు, బాలికలను ఉగ్రవాదులు అపహరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. అదే ఏడాది అక్టోబరు నెలలో మరో 500 మందిని అపహరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+