ఐసిస్: వరుసగా నిలబెట్టి కాల్చేసిన వీడియో విడుదల
డమాస్కర్: ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు తమ దారుణాలు చూపించే మరో వీడియోను విడుదల చేశారు. 25 మంది వరకు ప్రభుత్వ ఫోర్సెస్‌ను నిర్దాక్షిణ్యింగా చంపేశారు. సెంట్రల్ సిరియాలోని ప్రాచీన నగరం పాల్మిరాలో ఈ సంఘటన జరిగింది.
పాల్మీరాలోని మిలిన్నా ఓల్డ్ ఓయాసిస్‌లో గల ప్రాచీన రోమన్ థియేటర్‌లో వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ శనివారం చెప్పింది. ప్రస్తుతం ఆ థియేటర్ ఐసిస్ మిలిటెంట్ చేతుల్లో ఉంది. మే నెల నుండి అది వారి చేతుల్లోనే ఉంది.

వీడియోలో... సైనికులను మోకాళ్ల పైన కూర్చుండబెట్టారు. వారి ముఖాలకు మాస్కులు వేశారు. వారి పక్కన ఐసిస్ ఉగ్రవాదులు నిలుచున్నారు. వారి తలలకు తుపాకులు పెట్టారు. ఈ హత్యాకాండ మే 27వ తేదీన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications