వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసీస్ మరో దుశ్చర్య: సిరియాలోని 150 మంది క్రైస్తవులు కిడ్నాప్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

సిరియా: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మరో దుశ్చర్యకు పాల్పడింది. సిరియా ఈశాన్య ప్రాంతంలో కనీసం 150 మంది క్రైస్తవులను మంగళవారం కిడ్నాప్ చేసినట్లు సమాచారం.

కుర్దు బలగాల నుంచి రెండు గ్రామాలను ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు స్వాధీనం చేసుకున్న సందర్భంగా ఈ కిడ్నాప్‌లు చోటు చేసుకున్నట్లు సిరియా మానవ హక్కుల సంఘం పేర్కొంది. తల్ షమిరామ్, తల్ హెర్ముజ్ గ్రామాలకు చెందిన ప్రజలు ఐసీస్ బారిన పడ్డట్లు మానవ హక్కుల అధికారి వెల్లడించారు.

Islamic State in Syria abducts at least 150 Christians

సిరియాలోని క్రైస్తవులపై ఐఎస్ఐఎస్ గత కొన్నాళ్లుగా తీవ్ర ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. సిరియాలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ఐసీస్ మిలిటెంట్లపై ఆదివారం సిరియా కుర్దీష్‌ మిలిటరీ అమెరికా సాయంతో రెండు సార్లు దాడులు నిర్వహించింది.

దీనికి ప్రతిగానే ఈ కిడ్నాప్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. సిరియా సరిహద్దుల యొక్క భూభాగం ఇరాక్‌లోని ఇస్లామిక్ ప్రభుత్వ నియంత్రణలో ఉంది. అయితే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మాత్రం ఈ కిడ్నాప్‌లకు సంబంధించి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

English summary
Islamic State militants have abducted at least 150 people from Assyrian Christian villages in northeastern Syria they had raided, Christian Syrian activists said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X