భారత్ అభివృద్ధి చేసిన "బరాక్‌ మిసైల్" ను ప్రయోగించిన ఇజ్రాయెల్‌..ఇరాన్ విలవిల

మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసింది. ఇప్పటికే పాకిస్థాన్ తో యుద్ధం సమయంలో భారత్ ప్రయోగించిన క్షిపణుల దెబ్బకి పాకిస్థాన్ తో పాటు ప్రపంచ దేశాలు షాక్ తిన్నాయి. మరోసారి ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధంలో భారత్ తయారీ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసిపోయింది.

తాజాగా ఇరాన్ పై భారత్ అభివృద్ధి చేసిన బరాక్ క్షిపణి వ్యవస్థను ప్రయోగించింది ఇజ్రాయెల్ దీంతో ఇరాన్ లో భారీగా నష్టం వాటిల్లింది. ఇరాన్ పై తొలిసారిగా ఈ మిసైల్స్ ను ఉపయోగించింది ఇజ్రాయెల్. దీంతో ఇరాన్ ఆందోళనలో పడింది. ఇజ్రాయెల్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలోకి చొచ్చుకొచ్చిన డ్రోన్ లను బరాక్ క్షిపణి వ్యవస్థ కూల్చేసింది.

ఇరాన్ ప్రయోగించిన అన్ మానెడ్ ఏరియల్ వెహికల్స్ డ్రోన్ లను బరాక్ రక్షణ వ్యవస్థ సాయంతో ఇజ్రాయెల్ కూల్చేసింది. గతవారం రోజులుగా సాగుతున్న ఈ యుద్ధంలో బరాక్ క్షిపణి వ్యవస్థను ఇజ్రాయెల్ వినియోగించడం ఇదే తొలిసారి. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఈ రక్షణ వ్యవస్థ.. ఇరాన్ డ్రోన్లను కూల్చడంలో ఎంతో ఉపయోగపడిందని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది.

గతంలో పాకిస్థాన్ పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో బరాక్ క్షిపణి వ్యవస్థను వినియోగించింది భారత్. డ్రోన్ లు, క్రూయిజ్ మిసైల్స్, ఇతర వైమానిక క్షిపణుల నుంచి రక్షణ కోసం బరాక్-8 వ్యవస్థను భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని డీఆర్​డీఓ తో కలిసి ఇజ్రాయెల్ అభివృద్ధి చేసింది. బరాక్ క్షిపణిని భారత్- ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

Israel Deploys India-Developed Barak Missile Iran Responds Amid Tensions

గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో తొలిసారి బరాక్ రక్షణ వ్యవస్థను భారత్ ఉపయోగించినట్లు సమాచారం. భారత్ పై పాకిస్థాన్ ప్రయోగించిన ఫతా 2 మిసైల్ ను అడ్డుకునేందుకు భారత వైమానిక రంగం ఈ రక్షణ వ్యవస్థను వినియోగించినట్లు సమాచారం. దీంతో తాజాగా ఇజ్రాయెల్ సైతం ఇరాన్ పై ఈ అస్త్రాన్ని ప్రయోగించి విజయం సాధించింది.

ఇజ్రాయెల్ లోని ప్రధాన నగరాలైన టెల్ అవీవ్, హైఫా, భీర్ షెవా లపై ఇరాన్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఇరాన్ జరిపిన దాడుల్లో భీర్ షెవాలోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ భవనం వద్ద క్షిపణి పడినట్లు సమాచారం అందుతోంది. ఈ ఘటనలో టెక్ పార్క్ లోని బిల్డింగ్ స్వల్వంగా ధ్వంసం అయినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+