Israel-Palestine War: ఇజ్రాయెల్ లో అత్యవసర ప్రభుత్వం ఏర్పాటు-ప్రధాని, విపక్ష నేత కలిసి..
పాలస్తీనా తీవ్రవాద సంస్ధ హమాస్ మెరుపుదాడులతో వేల కొద్దీ పౌరుల్నీ, సైనికుల్ని కోల్పోయిన ఇజ్రాయెల్ తీవ్ర స్దాయిలో ప్రతిదాడులు చేస్తోంది. అయితే పాలస్తీనా యుద్ధంతో ఎదురైన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ఎత్తుగడ వేశారు. ఏకంగా విపక్ష నేత బెన్నీ గాంట్జ్ తో కలిసి అత్యవసర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎమర్జెన్సీ ప్రభుత్వం ఇకపై కీలక నిర్ణయాలన్నీ తీసుకోబోతోంది.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, మాజీ డిఫెన్స్ చీఫ్ కూడా అయిన సెంట్రిస్ట్ ప్రతిపక్ష పార్టీ నేత బెన్నీ గాంట్జ్ అత్యవసర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించినట్లు గాంట్జ్ నేషనల్ యూనిటీ పార్టీ సంయుక్త ప్రకటనలో తెలిపింది.
ప్రధాని నెతన్యాహు, బెన్నీ గాంట్జ్, రక్షణ మంత్రి యోవ్ గల్లంట్‌లతో కూడిన యుద్ధ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. గాజాలో హమాస్‌తో పోరాడుతున్న సమయంలో ఎటువంటి సంబంధం లేని విధానాలను లేదా చట్టాలను ప్రోత్సహించబోమని ఈ ప్రకటన పేర్కొంది.

ఇజ్రాయెల్ ప్రస్తుతం హమాస్ ను తుదముట్టించేందుకు గాజాలో తీవ్ర స్దాయిలో పోరు చేపట్టింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకోవడం, వాటిని క్షేత్రస్ధాయిలో అమలు జరిగేలా చూడటం, విదేశాలతో సమన్వయం చేసుకోవడం ఈ ఎమర్జెన్సీ ప్రభుత్వం చేపట్టాల్సిన విధులు. ఇవి తప్ప దేశంలో పరిస్ధితులు, విధివిధానాలతో దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. పరిస్ధితులు సద్దు మణిగాక ఈ ప్రభుత్వం స్ధానంలో తిరిగి సాధారణ ప్రభుత్వం బాధ్యతలు చేపడుతుంది.
ఇజ్రాయెల్-పాలస్తీనా పోరుపై ఇప్పటికే పశ్చిమదేశాలు, అరబ్ దేశాలు రెండుగా చీలిపోయాయి. పశ్చిమదేశాలు ఇజ్రాయెల్ కు, అరబ్ దేశాలు పాలస్తీనాకు మద్దతు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రభుత్వం ఏర్పాటు ద్వారా దేశం ఐక్యంగా ఉందని చెప్పేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications