
పెగాసస్ నిఘా కుట్ర: ఇజ్రాయెల్ స్పందన -ఎన్ఎస్ఈ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ దర్యాప్తునకు ఆదేశం
అన్ని రంగాల ప్రముఖులపై ప్రభుత్వమే నిఘాకు పాల్పడిందనే ఆరోపణలు, పెగాసెస్ స్పైవేర్ వ్యవహారం భారత్ సహా పలు దేశాలను కుదిపేస్తున్న వేళ ఆ సంస్థ సొంత దేశమైన ఇజ్రాయెల్ కీలక స్పందన వెలువరించింది.
pegasus నిఘా కుట్ర: అసలు రహస్యం చెప్పేసిన విజయశాంతి -7వేల ఫోన్లు ట్యాపింగ్ -దెయ్యాలు:వేదాలు
ఇజ్రాయెల్ కు చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ ఈ స్పైవేర్ ను వివిధ దేశాలకు విక్రయించిన నేపథ్యంలో సదరు వ్యవహారాలపై ఇజ్రాయెల్ మంత్రుల బృందం ఒకటి దర్యాప్తు జరపనుంది. ఈ బృందానికి ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నేతృత్వం వహించనుంది. ఈ మేరకు రాయిటర్స్ సంస్థ బుధవారం కథనాలను ప్రసారం చేసింది.

నిఘా సాఫ్ట్ వేర్ అయిన పెగాసస్ ను ఎన్‌ఎస్‌వో సంస్థ ఎవరెవరికి ఎగుమతి చేసింది, ఎలాంటి ఒప్పందాలను కుదుర్చుకుంది తదితర అంశాలపై ఇజ్రాయెల్ మంత్రుల బృందం సమీక్షించనుందని, నేరుగా ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌కు నేరుగా ఈ బృందం నివేదిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, ఇజ్రాయెల్‌భుత్వం దర్యాప్తును తాము స్వాగతిస్తున్నామని ఎన్‌ఎస్‌వో అధికార ప్రతినిధి తెలిపారు. తమ సంస్థ కార్యకలాపాల్లో ఎటువంటి లోపాలూ లేవని పునరుద్ఘాటించారు.
నా రాజీనామా తర్వాతే కొత్త పథకాలు -సీఎంవోలో ఒక్క దళితుడూ లేడు -కేసీఆర్‌పై ఈటల ఫైర్
భారత్ సహా 50 దేశాలకు చెందిన వ్యక్తుల పేర్లు పెగాసస్ స్పైవేర్‌కు చెందిన టార్గెట్ జాబితాలో ఉన్నట్లు తేలింది. ఇందులో జర్నలిస్టులు, రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు, మానవ హక్కుల కార్యకర్తలు ఉన్నారు. ప్రస్తుతం భారత్‌లో దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అధికార పార్టీపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తుండగా.. దీంతో తమకేమాత్రం సంబంధం లేదని ప్రభుత్వం చెబుతోంది. పెగాసస్ ఉదంతంలో కేంద్రం పాత్రను నిర్ధారించేందుకు ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ఈనెల 28న భేటీ కానుంది.