isreal-hamas deal: ఇజ్రాయెల్ తో హమాస్ డీల్- కాల్పుల విరమణ, బందీల విడుదల !

గత నెలలో ఇజ్రాయెల్ పై మెరుపుదాడులకు దిగడం ద్వారా గాజాపై యుద్దానికి దిగేలా చేసిన తర్వాత ఇప్పుడు మృతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్న తరుణంలో దీనికి బ్రేక్ ఇచ్చేందుకు ఇరువర్గాలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఓ డీల్ కు రంగం సిద్ధమైది. ఇందులో భాగంగా ఇరువర్గాలు కాల్పుల విరమణ చేపట్టడంతో పాటు బందీల విడుదలకు కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

నెల రోజులుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య సాగుతున్న పోరుతో ఇరుదేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. అలాగే ఇజ్రాయెల్ దాడులతో గాజాలో మృతుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఇందులో చిన్నారులు ఎక్కువ సంఖ్యలో ఉంటున్న తరుణంలో అంతర్జాతీయంగా కూడా ఇజ్రాయెల్ పై ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. అదే సమయంలో హమాస్ వద్ద తమ దేశానికి చెందిన వారితో పాటు విదేశీ బందీలు కలుపుకుని 240 మంది వరకూ అలాగే ఉన్నారు. దీంతో హమాస్ తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇజ్రాయెల్ సిద్ధమైంది.

isreal-hamas agreed for a ceasefire and hostage release deal with these conditions

హమాస్, ఇజ్రాయెల్ మధ్య బందీల విడుదల తో పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒప్పందంలో భాగంగా మొత్తం 100 మంది బందీలను విడుదల చేయాలని ఇజ్రాయెల్ కోరుతుండగా, హమాస్ 70 మందిని మొదట విడుదల చేసేందుకు అంగీకరించింది. అలాగే ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ 5 రోజుల పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. అలాగే ఇజ్రాయెల్ కూడా అదే సంఖ్యలో పాలస్తీనా మహిళలు, యువకులను జైలు నుండి విడుదల చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+