పాక్ వెళితే.. సొంత తమ్ముడింటికి వెళ్లినట్లే: చైనా అధ్యక్షుడు జింపింగ్

బీజింగ్: పాకిస్థాన్‌లో పర్యటించడమంటే సొంత తమ్ముడి ఇంటికి వెళ్లినట్లేనని చైనా అధ్యక్షుడు జీ జింపింగ్‌ చెప్పారు. సోమవారం పాక్‌లో తొలిసారి పర్యటించనున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

'పాక్‌లో ఇది నా తొలి పర్యటన. కానీ, నేను నా సొంత సోదరుడి ఇంటికి వెళుతున్నట్లుగానే భావిస్తున్నా' అని జీ పాకిస్థాన్ మీడియాకు రాసిన వ్యాసంలో జింపింగ్ పేర్కొన్నారు.సోమవారం నుంచి ప్రారంభమయ్యే తన పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక బంధాల బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

It's Like Visiting Home of 'Own Brother': Chinese President Xi Jinping Ahead of Pakistan Trip

తన పర్యటనతో పాక్-చైనా మధ్య ద్వైపాక్షి బంధం మరింత మెరుగుపడుతుందని చెప్పారు. పాక్ నాయకత్వంతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పాక్ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు.

పాకిస్థాన్‌లో పర్యటించనున్న ఆయన, మంగళవారం ఇండోనేషియాలో జరిగే బాండుంగ్ సమావేశానికి హాజరవుతారు. రూ.2.85 లక్షల కోట్లతో పాకిస్థాన్‌తో చైనాలోని జింజియాంగ్‌ ప్రావిన్స్‌, పాకిస్థాన్‌లోని గ్వాదర్‌ నౌకాశ్రయాలను కలుపుతూ (పాక్‌ ఆక్రమిత కాశ్మీరు గుండా) ఆర్థిక నడవను ఏర్పాటు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+