Ring of Fire: పెను భూకంపం- సరిగ్గా నెల రోజుల తరువాత అదే ప్రదేశంలో..!!
టోక్యో: జపాన్‌ను మరోసారి పెను భూకంపం సంభవించింది. హొక్కాయిడోను వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా రికార్డయింది. జపాన్ ఉత్తర ప్రాంతంలో ఉంటుందీ హొక్కాయిడో. అక్కడి నెమురో రీజియన్‌లో భూమి ప్రకంపించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:48 నిమిషాలకు ఈ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. నెల రోజుల కిందట అంటే ఫిబ్రవరి 26వ తేదీన ఇదే ప్రాంతంలో భూకంపం నమోదైంది. ఇప్పుడు మళ్లీ అదే రీజియన్‌ను వణికించింది.
ఈ భూకంప తీవ్రత తీర ప్రాంత నగరాలైన ఇకెడ, టొయొకొరొ, ఒబిహిరో.. వంటి ప్రాంతాల్లో భారీగా కనిపించింది. ఆయా ప్రాంతాల్లో భూ ప్ర్రకంపనలు నమోదయ్యాయి. పలు చోట్ల భవనాలకు బీటలు వారాయి. ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం అందలేదు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు నమోదు కావడం వల్ల స్థానికులు ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. భూకంపం సంభవించిన వెంటనే రోడ్ల మీదికి ఉరుకులు పరుగులు పెట్టారు.

అంతకుముందు- ఈ నెల 24వ తేదీన కూడా జపాన్‌లో భూకంపం చోటు చేసుకుంది. ఇజు దీవులలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.6గా రికార్డయింది. జపాన్ లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. దీని తీవ్రత భారీగా ఉండటం ఆందోళనను కలిగిస్తోంది. రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉండే దేశాల్లో ఇదీ ఒకటి. బొలీవియా, చిలీ, ఈక్వెడార్, పెరూ, కోస్టారికా, గ్వాటెమాల, మెక్సికో, అమెరికా, కెనడా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, పాపువా న్యూగినియా, ఇండోనేషియా, న్యూజిలాండ్, అంటార్కిటికా- ఈ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉన్నాయి.
ఇదివరకెప్పుడూ లేని విధంగా ఈ మధ్యకాలంలో తరచూ భూకంపాలు సంభవిస్తోన్న విషయం తెలిసిందే. దాని తీవ్రత, ప్రాణ, ఆస్తినష్టం పెద్ద ఎత్తున ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొద్దిరోజుల కిందటే టర్కీ, దాని పొరుగునే ఉన్న సిరియాల్లో వరుస భూకంపాలు విధ్వంసాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ రెండు దేశాల్లో పదుల సంఖ్యలో భూకంపాలు సంభవించాయి. అనూహ్య నష్టాలను మిగిల్చాయి.
టర్కీ, సిరియాల్లో సంభవించిన వరుస భూకంపాల వల్ల 50 వేల మందికి పైగా మరణించారు. టర్కీలో 45,968 మంది దుర్మరణం పాలయ్యారు. సిరియాలో ఈ సంఖ్య 7,259గా రికార్డయింది. ఈ రెండు దేశాలు కూడా ఇప్పటికీ తేరుకోలేకపోతోన్నాయి. ఆ విషాద ఛాయలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. టర్కీ, సిరియాలకు సహాయ, సహకారాలను అందించడానికి భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ ముందుకొచ్చాయి. మానవతాదృక్పథంతో ఆదుకున్నాయి. పెద్ద ఎత్తున ఆర్థిక, మానవ వనరుల సహాయాన్ని ప్రకటించాయి.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications