వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌పై అమెరికా ట్రావెల్ బ్యాన్: వీరికి మాత్రమే మినహాయింపులు, వీసా దరఖాస్తులపై పరిమితులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతదేశంలో సెకండ్ వేవ్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు భారత్ నుంచి వచ్చేవారిపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా, అమెరికా కూడా అదే పనిచేసింది. వచ్చే వారం నుంచి భారత్ నుంచి అమెరికాకు వచ్చే వారిపై నిషేధం విధిస్తున్నట్లు శుక్రవారం వైట్‌హౌస్ ప్రకటించింది.

మే 4 నుంచి భారత్ నుంచి ట్రావెల్ బ్యాన్

మే 4 నుంచి భారత్ నుంచి ట్రావెల్ బ్యాన్

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సూచన మేరకు ఇండియా నుంచి అమెరికాకు వచ్చేవారిపై నిషేధం విధించినట్లు యూస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సకి ఓ ప్రకటనలో వెల్లడించారు. భారతదేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు మే 4 నుంచి అమలులోకి రానున్నాయని పేర్కొన్నారు.

ట్రావెల్ బ్యాన్ నుంచి వీరికే మినహాయింపులు

ట్రావెల్ బ్యాన్ నుంచి వీరికే మినహాయింపులు

అయితే, ఈ నిషేదాజ్ఞల నుంచి కొందరికి మినహాయింపులు ఇచ్చినట్లు అమెరికా విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ తెలిపారు. బ్రెజిల్, చైనా, ఇరాన్, సౌతాఫ్రికా వంటి దేశాలకు చెందిన వర్గాలకు మినహాయింపులు ఇచ్చినట్లే ఇవి కూడా ఉంటాయని తెలిపారు. అమెరికాలో తమ చదువును ప్రారంభించాలనే, కొనసాగించాలనుకునే విద్యార్థులకు, అకాడమిక్స్ కు, జర్నలిస్టులకు, కరోనా రోగులకు క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అందించే వ్యక్తులకు ఈ మినహాయింపులు ఉంటాయని వివరించారు. ఇండియాతోపాటు చైనా, ఇరాన్ వంటి దేశాల్లో ఉన్న క్వాలిఫైడ్ అప్లికేంట్లకు కూడా ఈ సౌకర్యం వర్తిస్తుందని పేర్కొన్నారు.

అమెరికా వీసాల దరఖాస్తులూ పరిమితంగానే

అమెరికా వీసాల దరఖాస్తులూ పరిమితంగానే

కాగా, కరోనా మహమ్మారి కారణంగా వీసా దరఖాస్తులను కూడా పరిమితం చేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. విద్యార్థులు తమ సమీప ఎంబసీ లేదా కాన్సులేట్ కార్యాలయాల వెబ్‌సైట్లను తరచూ తనిఖీ చేస్తుండాలని, తద్వారా వారికి ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుస్తుందని టోనీ బ్లింకెన్ సూచించారు. రానున్న రోజుల్లో మరిన్ని వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు.

Recommended Video

Virat Kohlil Century తో ముడిపడ్డ Coronavirus అభిమాని జోస్యం.. ప్రపంచం కోసం సెంచరీ చేయవా కోహ్లీ
భారత్‌కు అమెరికా సాయం.. అమెరికన్లకు పిలుపు

భారత్‌కు అమెరికా సాయం.. అమెరికన్లకు పిలుపు

భారత్‌లో ఉన్న అమెరికన్లు సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి రావాలని ఇప్పటికే బైడెన్ ప్రభుత్వం సూచించింది. భారతదేశంలో కరోనా ఉధృతి, పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. అంతేగాక, భారత్ కు సాయం చేసేందుకు కూడా ముందుకు వచ్చింది.

అమెరికా వాయుసేనకు చెందిన అతిపెద్ద, వ్యూహాత్మకమైన సీ-5 సూపర్ గెలాక్సీ విమానం అత్యవసర వైద్య సామాగ్రిని ఢిల్లీకి తీసుకొచ్చింది. ఆక్సిజన్ సిలిండర్లతోపాటు రెగ్యులేటర్లు, మాస్కులు ఉన్నాయి. ఈ క్రమంలో అమెరికాకు భారత్ ధన్యవాదాలు తెలిపింది.

English summary
The United States will restrict travel from India starting next week, due to rampant spread of Covid-19 in the country, the White House said Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X