ఐరాస భద్రతామండలిలో భారత్ కు శాశ్వత హోదా- ఎలాన్ మస్క్ డిమాండ్ కు బైడెన్ ఓకే..!

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచదేశాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు చేపట్టకపోవడంపై బిలియనీర్ ఎలాన్ మస్క్ ఈ ఏడాది జనవరిలో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ముఖ్యంగా భారత్ తో పాటు ఆఫ్రికాకూ ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా చోటు కల్పించకపోవడాన్ని తప్పుబడుతూ మస్క్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా ఎట్టకేలకు స్పందించింది.

ఐరాసలో సంస్కరణలు కోరుతూ ఎలాన్ మస్క్ చేసిన డిమాండ్ పై స్పందించిన అమెరికా హోంశాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనం జీవిస్తున్న 21వ శతాబ్దపు ప్రపంచాన్ని ప్రతిబింబించేలా భద్రతా మండలితో సహా ఐరాసలో సంస్కరణలకు తాము కచ్చితంగా మద్దతిస్తామని బైడెన్ చెప్పినట్లు పటేల్ తెలిపారు. అయితే అది ఏ దశల్లో జరగాలో తాము చెప్పలేమని, కానీ కచ్చితంగా ఈ డిమాండ్లను గుర్తించినట్లు చెప్పారన్నారు.

joe biden supports elon musk s demand on permanent UNSC seat for india

అయితే జనవరిలో ఎలాన్ మస్క్ ఎక్స్ లో చేసిన ట్వీట్ లో ఏదో ఒక సమయంలో, ఐరాసలో భాగంగా ఉన్న సంస్ధల్లో సంస్కరణల అవసరం ఉందన్నారు. సమస్య ఏమిటంటే బలమైన శక్తి ఉన్నవారు దానిని వదులుకోవడానికి ఇష్టపడరని, భూమ్మీద అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్నప్పటికీ భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత స్థానం లేకపోవడం అసంబద్ధమని తెలిపారు. ఆఫ్రికా కూటా సమిష్టిగా శాశ్వత సీటు హోదాని కలిగి ఉండాలన్నారు. దీనిపై స్పందించిన అమెరికా ఈ వీటికి మద్దతిస్తామని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+