Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్రంప్ నిజ స్వరూపం బట్టబయలు

Kamala Harris: వెనిజులాలో అమెరికా చేపట్టిన సైనిక చర్య ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. రాజధాని కరాకస్‌పై దాడి అనంతరం ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టు చేసి న్యూయార్క్‌కు తరలించారు. 'ఆపరేషన్ అబ్‌సొల్యూట్ రిసాల్వ్'గా దీనికి పేరు పెట్టింది అమెరికా. వెనెజులా ప్రస్తుతానికి తమ నియంత్రణలో ఉంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే కొత్త అధ్యక్షుడిని నియమిస్తామనీ పేర్కొన్నారు.

వెనిజులాపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యలను అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తప్పుపట్టారు. ఈ దాడులు అక్రమం, అవివేకమైనవిగా ఆమె అభివర్ణించారు. మున్ముందు- ఇవి అత్యంత ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్యలు అమెరికాకు భద్రతను గానీ, బలాన్ని గానీ చేకూర్చబోవని, పైగా తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయని కమలా హ్యారిస్ హెచ్చరించారు.

Kamala Harris States Trump s Venezuela Seems Driven by Oil Interests and Ego Not Security

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను క్రూరమైన నియంతగా డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడం, ఆయనను నిర్బంధించడానికి ఆ దేశంపై వైమానిక దాడులకు దిగడాన్ని వ్యతిరేకించారు. ఈ దాడులు గానీ, డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన సైనిక చర్యగానీ ఎంత మాత్రం సహేతుకమైనవి, సమర్థనీయమైనవి కావని అన్నారు. ఈ వ్యవహారం మొత్తంపైనా ఆమె స్పందించారు. ఎక్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ దుందుడుకు చర్యలు అమెరికాను సురక్షితంగా, బలంగా, ఆర్థికంగా స్థిరంగా ఉంచలేవని, పైగా ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తాయని తేల్చి చెప్పారు. జాతీయ భద్రత అంశాన్ని కారణంగా చూపుతూ వెనిజులాలో లభించే ముడి చమురుపై డొనాల్డ్ ట్రంప్ కన్నేశారని, వాటిని దోచుకోవడానికి ఆ దేశంపై దాడులకు పాల్పడినట్లు భావించాల్సి వస్తోందని కమలా హ్యారిస్ వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాల కంటే, సహజ వనరులు, అహంకారపూరిత ధోరణితో దాడులకు ప్రేరేపించాయని హారిస్ పేర్కొన్నారు.

అమెరికా ప్రజలు ఈ రకమైన చర్యలను కోరుకోవట్లేదని, ట్రంప్ వల్ల విసిగిపోయారని ఆమె స్పష్టం చేశారు. ట్రంప్ నిజంగా డ్రగ్స్ అక్రమ రవాణా గురించి పట్టించుకుని ఉంటే అప్పుడు దోషిగా తేలిన స్మగ్లర్‌ను క్షమించేవారు కాదని అన్నారు. మదురో సన్నిహితులతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ వెనిజులాలోని చట్టబద్ధమైన ప్రతిపక్షాన్ని పక్కన పెట్టేవారు కాదని వ్యాఖ్యానించారు. ట్రంప్ తన చర్యలతో సైనికులను ప్రమాదంలో పడేస్తున్నారని, బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారని, ఒక ప్రాంతాన్ని అస్థిరపరుస్తున్నారని ఆరోపించారు.

Take a Poll

కమలా హారిస్ విమర్శలకు సెనేటర్ బెర్నీ సాండర్స్, సెనేట్ మెజారిటీ లీడర్ చక్ షుమర్ వంటి ఇతర ప్రముఖ వ్యక్తులు కూడా మద్దతు పలికారు. ట్రంప్ చర్యలు ప్రమాదకరమైనవని, భయాందోళనలు రేకెత్తించేవని అన్నారు. అంతర్జాతీయంగా బ్రెజిల్, మెక్సికో, చైనా, యూరప్ దేశాధినేతలతో పాటు ఐక్యరాజ్యసమితి కూడా అమెరికా సైనిక చర్య గురించి ప్రస్తావించడాన్ని గుర్తు చేశారు.. దేశ సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+