సంచలనం: బ్రిటన్ యువరాజు ప్రిన్స్ దంపతులు టాప్ లెస్ ఫోటోలు ప్రచురించిన మేగజైన్

Posted By:
Subscribe to Oneindia Telugu

పారిస్: సంచలనం సృష్టించిన బ్రిటన్ యువరాజు భార్య కేట్ మిడిల్టన్ టాప్ లెస్ ఫోటోల వ్యవహరాం ఫ్రెంచ్ కోర్టు విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురు జర్నలిస్టులను మంగళవారం నాడు ప్రశ్నించింది.

ఐదేళ్ళక్రితం ప్రిన్స్ దంపతులు దక్షిణ ఫ్రాన్స్ లో ఓ ఫాంహౌస్ లో విడిదిచేశారు. అనుమతిలేకుండా మూడో వ్యక్తికి అక్కడ ప్రవేశం లేదు.అయితే కేట్ మిడిల్టన్ టాప్ లెస్ గా భర్తతో కలిసి సన్ బాత్ చేయగా ఫోటోలు తీసి ఫ్రెంచ్ మేగజైన్ పేపర్ క్లోజర్ లో 2012 సెప్టెంబర్ లో ప్రచురించారు.

Kate Middleton: Paparazzi on trial over topless photos, lawyer says much ado about nothing

తమ పరువుకు భంగం వాటిల్లే విధంగా పోటోలు ప్రచురించిన మ్యాగజైన్ పై 1.5 మిలియన్ యూరోలను చెల్లించాలని బ్రిటన్ రాకుమారుడు విలియం దంపతులు దావా వేశారు.పత్రికల మొదటిపేజీలో ప్రచురించి బ్రిటన్ రాచకుటుంబం పరువు తీశారన్న కేట్ మిడిల్టన్ తరపు న్యాయవాదుల వాదనకు కోర్టు గత ఏడాది మొగ్గుచూపింది.

టాప్ లెస్ ఫోటోలు ప్రచురించిన క్లోజర్ మేగజైన్ కు చెందిన ఆరుగురు జర్నలిస్టులపై విచారణ చేపట్టింది. ఆ టాప్ లెస్ ఫోటోలు ఇప్పటికే యూరోపియన్ పబ్లికేషన్స్ అయిన ఇటలీలో చే, స్వీడన్ , డెన్మార్క్ లలో డైలీ స్టార్, సిస్టర్ మేగజైన్స్ లలో ప్రచురించారు.

దీంతో ప్రిన్స్ దంపతులు న్యాయపోరాటాన్ని ఉధృతం చేశారు. క్లోజర్ మేగజైన్ ఎడిటర్ లారెన్స్ పియు, ఓ సీనియర్ జర్నలిస్టు, ఇద్దరు ఫోటో జర్నలిస్టులు, మరో ఇద్దరు ఫ్రీలాన్స్ ఫోటో జర్నలిస్టులపై విచారణ సాగుతోంది.

1997 లో కేట్ అత్త దివంగత ప్రిన్సెస్ డయానా మీడియా నుండి తప్పించుకొనే క్రమంలోనే ప్రమాదానికి గురై మరణించడంతో ఆ రాజకుటుంబానికి జర్నలిస్టులపై ఇంకా ఆగ్రహంగా ఉన్నారు. కేట్ మిడిల్టన్ ఫోటోలు వారి అన్యోన్యతను మాత్రమే తెలుపుతుండగా, దీనిపై పరువునష్టం దావా వేశారని లాయర్ పాల్ అల్బర్ట్ ఐయిన్స్ చెప్పారు.

తమ ఫోటో జర్నలిస్టులు నేరుగా ఈ పోటోలు తీయలేదని, ఇతర వ్యక్తుల ద్వారా సంపాదించిన ఫోటోలను మాత్రమే పబ్లిష్ చేశామని క్లోజర్ మేగజైన్ వివరణ ఇచ్చింది.కానీ, మేగజైన్ వివరణతో కోర్టు సంతృప్తి చెందలేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Three photographers have appeared in a French court over topless photographs of the Duchess of Cambridge, an alleged invasion of privacy that outraged Britain's royal family.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి