Viral Video: ట్రంప్ ప్రమాణస్వీకారంలో తీవ్రవాది..షాకింగ్ నినాదాలు..!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తాజాగా బాధ్యతలు స్వీకరించారు. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి దేశ విదేశీ అతిధులు హాజరయ్యారు. అలాగే అమెరికాకు చెందిన పలు కార్పోరేట్ దిగ్గజాలు కూడా హాజరయ్యారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ కార్యక్రమంలో ఓ తీవ్రవాది కూడా దర్శనమిచ్చాడు. ట్రంప్ ఈవెంట్ ముగిసిన రెండు రోజుల తర్వాత తాను పాల్గొన్న వీడియోల్ని బయటపెట్టాడు. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత్ లో ప్రత్యేక ఖలిస్తాన్ కోరుతూ ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తున్న నేతలతో పాటు విదేశాల్లో ఉంటూ పోరాటాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. వీరిలో కొందరిని తీవ్రవాదులుగా పలు దేశాలు గుర్తించాయి. ఇలాంటి వారిలో ఒకడు గురు పత్వంత్ సింగ్ పన్నూ. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన గురు పత్వంత్ బహిరంగంగా కనిపించే సందర్భాలు చాలా తక్కువ. కానీ ఉన్నట్లుండి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారంలో అతిధుల మధ్య కనిపించాడు.

డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ పన్నూ ఖలిస్తాన్ జిందాబాద్ నినాదాన్ని కూడా వినిపించాడు. ఓవైపు ట్రంప్ ఈవెంట్ జరుగుతుండగా స్టేజ్ పక్కనే నిలబడిన పన్నూ.. ఇలా ఖలిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖలిస్తాన్ కోసం పోరాడుతున్న సిక్కు ఫర్ జస్టిస్ జనరల్ కౌన్సెల్ పన్నూ కోసం ట్రంప్ ఈవెంట్ కు టికెట్ కొన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ కార్యక్రమానికి ఆయనకు ఆహ్వానం లేదు.
Pannun Spotted 🤡 in trump ceremony 🚨 pic.twitter.com/4Q67AVLub4
— Extra Dotted 🔥 (@Love_deyy) January 21, 2025
ట్రంప్ ప్రమాణస్వీకారం పూర్తి చేసి ప్రారంభోపన్యాసం చేస్తున్న సమయంలో అక్కడ గుమికూడిన జనం అంతా యూఎస్‌ఏ, యూఎస్‌ఏ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇంతలో పన్నూ 'ఖలిస్తాన్ జిందాబాద్' అంటూ కనిపించాడు. ఈ వీడియోను తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ లోనే పోస్ట్ చేసాడు. ముందు స్టేజ్ ను చూపిస్తూ ఆ తర్వాత తాను కనిపించేలా ఈ వీడియో తీశారు. అలాగే తన ఎక్స్ పోస్టులో అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణస్వీకారానికి ప్రత్యేక అతిథి అని కూడా పేర్కొన్నాడు.












Click it and Unblock the Notifications