ఆ రెండు దేశాలకు అణ్వాయుధాలు: కిమ్ ప్లాన్‌తో అమెరికాను వెంటాడుతున్న భయం
ఎమిలీ లాండ్యూ అనే మహిళా పరిశోధకురాలు ఈ విషయాలను మీడియాకు వెల్లడించింది.
వాషింగ్టన్: దౌత్య పరంగా ఉత్తరకొరియాను ఏకాకిని చేయడం ద్వారా ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని అగ్రరాజ్యం అమెరికా భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఐరాస ఒత్తిడి మేరకు చైనాతో ఆ దేశానికి ఉత్పత్తి సంబంధాలు నిలిచిపోయాయి.
మరోవైపు పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్ కూడా అమెరికా వైపు నిలబడటంతో.. ఎగుమతులు, దిగుమతులు లేక ఉత్తరకొరియా విలవిల్లాడుతోంది. అయితే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి అణు ఆయుధాలను అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని చూస్తోంది.

ఎమిలీ లాండ్యూ అనే ఓ పరిశోధకురాలు ఈ విషయాలు వెల్లడించారు. సిరియా, ఇరాన్ లకు అణ్వాయుధాలు విక్రయించడం ద్వారా ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకోవాలని ఉత్తరకొరియా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇదే విషయమై ప్రస్తుతం ఆ రెండు దేశాలతో ఉత్తకొరియా చర్చలు జరుపుతోందని అన్నారు. ఈ చర్యలన్ని పరోక్షంగా అమెరికాను టార్గెట్ చేసినవే అని ఆమె పేర్కొనడం గమనార్హం.
అణు ఆయుధాల అమ్మకాలకు ఉత్తరకొరియా సిద్దపడుతోంది కాబట్టే.. రెండు రోజుల క్రితం రహస్యంగా తమ సైనిక స్థావరానికి వెళ్లిన కిమ్.. మరిన్ని అణు ఆయుధాల తయారీకి ఆదేశాలిచ్చారన్న ప్రచారం జరుగుతోంది. కిమ్ వైఖరితో అమెరికాకు మున్ముందు గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు.
Recommended Video

-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications