Vladimir Putin: పుతిన్ కు గుండెపోటు ? క్లారిటీ ఇచ్చిన క్రెమ్లిన్...

రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ కు నిన్న అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినట్లు స్వదేశంలో ప్రచారం జరిగింది. ఆయన ఉన్నట్లుండి పడిపోయారని, పక్కనే ఉన్న మందుల్ని కూడా కాలితో తన్నేశారని కూడా వార్తలొచ్చాయి. ఈ మధ్యకాలంలో పుతిన్ ఆరోగ్యంపై వరుసగా పుకార్లు చెలరేగుతున్న వేళ గుండెపోటు గురించి రష్యన్లతో పాటు అంతర్జాతీయంగా కూడా ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఇవాళ దీనిపై స్పందించింది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో స్పందించిన క్రెమ్లిన్.. ఈ పుకార్లను తోసిపుచ్చింది . ఆయన ఆరోగ్యంగా, బాగానే ఉన్నారని ధృవీకరించింది. జర్నలిస్టులతో ఒక సాధారణ బ్రీఫింగ్ సందర్భంగా క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్.. అధ్యక్షుడు బాడీ డబుల్స్‌ను ఉపయోగిస్తున్నారనే వాదనలను ఖండించారు. దీన్నో బూటకపు ప్రచారంగా ఆయన తోసిపుచ్చారు.

kremlin clarified Vladimir Putins heart attack rumours, says fit and well

కొన్ని పాశ్చాత్య మీడియా సంస్థలు ప్రసారం చేసిన రష్యన్ టెలిగ్రామ్ ఛానెల్ నుండి ధృవీకరించని నివేదికల నేపథ్యంలో విలేకరులు పుతిన్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. దీనిపై రష్యన్లలోనూ ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో క్లెమ్లిన్ వర్గాలు స్పందించాయి. 2022 నుండి పుతిన్ క్యాన్సర్, పార్కిన్సన్స్ వ్యాధితో సహా తీవ్రమైన వ్యాధులతో పోరాడుతున్నట్లు పలు రిపోర్టులు వచ్చాయి. పుతిన్ బహిరంగంగా కనిపించినప్పుడు నిలబడలేకపోతున్నట్లు, ఆయన శరీరం ఉబ్బినట్లుగా కనిపించడం కూడా ఈ పుకార్లకు ఆజ్యం పోసింది.

అయితే ఎప్పటికప్పుడు రష్యా ప్రభుత్వం ఈ వార్తల్ని ఖండిస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా గుండెపోటు పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని కూడా క్రెమ్లిన్ తోసిపుచ్చడంతో ఇదంతా ఒట్టిదేనని తేలిపోయింది. ప్రస్తుతం ఉక్రెయిన్ తో చేస్తున్న యుద్దంపై దృష్టిపెట్టిన పుతిన్.. ఆ వ్యూహాల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+