వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉక్రెయిన్ రాజధానిపై విరుచుకుపడుతున్న రష్యా - కీవ్‌ను ఆక్రమించుకుంటోన్న సైన్యం: లైవ్‌లో..

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలల తరబడి కొనసాగుతున్న యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన యుద్ధం అనూహ్య మలుపు తీసుకుంటోంది. ఇన్ని రోజులుగా నిరాటంకంగా కొనసాగుతూ వస్తోన్న యుద్ధం అంతిమస్థాయికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది.

ములాయంతో దిగిన పాత ఫొటోలను షేర్ చేసిన మోదీ: ఆసుపత్రికెళ్లిన షా: జగన్, కేసీఆర్ సహా..!!ములాయంతో దిగిన పాత ఫొటోలను షేర్ చేసిన మోదీ: ఆసుపత్రికెళ్లిన షా: జగన్, కేసీఆర్ సహా..!!

 తూర్పు ధ్వంసం..

తూర్పు ధ్వంసం..

ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిని రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్, ఖార్కీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. డొనెట్స్క్, లుహాన్స్క్ ఝపరొజ్ఝియా, ఖేర్సన్ రీజియన్లను రష్యా విలీనం చేసుకోవడానికి రెఫరెండం సైతం నిర్వహించింది.

 కీవ్‌ను ఆక్రమించుకునే దిశగా..

కీవ్‌ను ఆక్రమించుకునే దిశగా..

ఉక్రెయిన్ తూర్పున ఉన్న మెజారిటీ నగరాలను రష్యా ఆక్రమించుకున్నప్పటికీ- రాజధాని కీవ్‌ను మాత్రం చేరుకోలేకపోయింది. కీవ్ రక్షణ వలయాన్ని రష్యా సైన్యం ఛేదించలేకపోయింది. పైగా చాలా సందర్భాల్లో వెనకంజ వేసింది కూడా. అమెరికా, యూరోపియన్ యూనియన్, నాటో సభ్య దేశాలు అందించిన ఆయుధ సంపత్తితో ఇన్ని రోజుల పాటు రష్యా దాడులను సమర్థవంతంగా తిప్పి కొడుతూ వచ్చింది ఉక్రెయిన్.

భారీ పేలుళ్లు..

భారీ పేలుళ్లు..

ఇప్పుడా రక్షణ వ్యవస్థను రష్యా సైన్యం ఛేదించినట్టే కనిపిస్తోంది. మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. భారీ ఎత్తున దాడులు సాగిస్తోంది. ఈ ఉదయం నుంచి సెంట్రల్ కీవ్‌లో పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి. పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. పేలుళ్లు సంభవించిన విషయాన్ని కీవ్ మేయర్ విటాలి క్లిట్స్‌కోవ్ ధృవీకరించారు. ఉదయం 8:30 గంటలకు తొలి పేలుడు శబ్దం వినిపించిందని, ఆ తరువాత తీవ్రం అయ్యాయని పేర్కొన్నారు.

కొత్త ఆర్మీ జనరల్..

కొత్త ఆర్మీ జనరల్..

క్రిమియా రీజియన్ నుంచి రష్యాను కనెక్ట్ చేసే 19 కిలోమీటర్ల వంతెనను అతి పొడవైన వంతెనను ఉక్రెయిన్ పేల్చేసిన తరువాత రష్యా కీలక నిర్ణయాలను తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనను వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటన అనంతరం పుతిన్ మరో కీలక నిర్ణయాన్నీ తీసుకున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయడానికి కొత్త ఆర్మీ జనరల్‌ను నియమించారు.

లైవ్‌లో లేచెల్లిన న్యూస్ రీడర్

యుద్ధాన్ని మాత్రమే పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా సెర్గీ సురికోవిన్‌ను జనరల్‌గా అపాయింట్ చేశారు. సెర్గీని అపాయింట్ చేసిన రెండో రోజే- రష్యా సైన్యం కీవ్‌ను ఆక్రమించుకునే దిశగా అడుగులు వేస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. సరికొత్త వ్యూహాలు, దూకుడుతో రష్యా సైన్యం కీవ్ వైపు దూసుకొస్తోన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్ధారించాయి. కీవ్‌లో పేలుడు సంభవిస్తోన్నాయనే వార్తలను చదువుతున్న బీబీసీ న్యూస్ రీడర్.. పేలుళ్లు సంభవించిన శబ్దం విని లైవ్‌లో లేచి వెళ్లిపోవడం కనిపించింది.

English summary
Kyiv mayor Vitali Klitschko confirmed that there were several explosions that struck the center of the City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X