ముసలివాళ్లతోనే రొమాన్స్.. కారణం తెలిస్తే నోరు వెళ్లబెడతారు..!
ఆమె ఓ మోడల్. తన అందంతో ముసలివాళ్లకు మస్కా కొట్టి రూ. కోట్లు దోచుకుని అక్కడి నుంచి జంప్ అవుతుంది. డేటింగ్ యాప్స్ ద్వారా ముసలి వాళ్లకు పరిచయం అవుతుంది. వారికి మాయ మాటలు చెబుతుంది. వాళ్ల ఇంటికి వచ్చి వారితో రొమాన్స్ జరుపుతుంది. ఆ తర్వాత ఇంట్లోని విలువైన వస్తువులు, నగదు, ఆభరణాలతో జంప్ అవుతుంది. ఇలా చాలా మంది వృద్ధులను ఆమె బుట్టలో వేసినట్లు తేలింది. ఈ ఘరానా లేడీ కోసం ఇప్పుడు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
లాస్ ఏంజెల్స్ కు చెందిన అడ్వా లవీ అలియాస్ మియా వెంచురా షోషానా.. ఓ మోడల్. ఆమె గతంలో పెంట్ హౌజ్ పెట్ అనే మ్యాగజైన్ లో కవర్ ఫోటోతో ఫేమస్ అయింది. ఆమె చేసే పని ఏంటంటే.. తన అందంతో ముసలివాళ్లను టార్గెట్ చేస్తుంది. ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ ద్వారా వారికి పరిచయం అవుతుంది. వారితో చాట్ చేసి.. వృద్ధుల ఇంటికి వస్తుంది. అలా వారితో డేటింగ్ చేసి ఇంట్లోని నగదు, విలువైన వస్తువులతో జంప్ అవుతుంది. పలువురి ఫిర్యాదు మేరకు లాస్ ఏంజెల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అడ్వా లవీ(27) గతంలో ఓ మోడల్. పెంట్ హౌజ్ పెట్ అనే మ్యాగజైన్ ద్వారా ఆమె పాపులర్ అయింది. ఆమె కోటీశ్వరులు, బడా వ్యాపారవేత్తలు అయిన వారితో సీక్రెట్ గా ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయం అవుతుంది. వారిని తన మాయమాటలతో మత్తులోకి దించి వాళ్ల ఇంటికి చేరుతుంది. అలా భారీ దోపిడీలకు పాల్పడుతుంది. ఆమెకు బ్లాక్ పోర్షే కారు, వైట్ మెర్సిడెస్ బెంజ్ కారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

అడ్వా లవీ ఇజ్రాయెల్ లో పుట్టిపెరిగి ఆ తర్వాత అనేక వృత్తులు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కొంతకాలం ఇజ్రాయెల్ మిలిటరీలోనూ పని చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆమె ఇప్పటివరకు ఎంతమందిని ఇలా మాయ చేసి దోపిడీలకు పాల్పడిందో తెలియాల్సి ఉంది. అడ్వా లవీ సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications