మరోసారి బయటపడ్డ పాక్ వక్రబుద్ధి.. నిజాన్ని ఒప్పుకున్నారు..!!
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మరోసారి బయటపడింది. భారత్ తమ పౌరులపై దాడి చేసిందని పాక్ ప్రకటించిన వాదనలకు వ్యతిరేకంగా, పాకిస్థాన్‌లోని ప్రధాన ఉగ్రవాద సంస్థల కమాండర్లు స్వయంగా కీలక విషయాలు అంగీకరించారు. ఈ విషయాలను ధృవీకరించే పలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా, వార్తా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
దాడి జరిగింది నిజమే..
లష్కరే-తయ్యిబా (LeT) టాప్ కమాండర్ ఖాసిం, పంజాబ్ ప్రావిన్స్‌లోని మురిద్కే మార్కజ్ తయ్యిబా ప్రధాన కార్యాలయం ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైందని స్పష్టంగా ఒప్పుకున్నాడు. శిథిలాల మధ్య నిలబడి చేసిన వీడియోలో ఖాసిం.. ఇది భారత్ దాడిలో ధ్వంసమైన మర్కజ్ తయ్యిబా. దేవుడి దయతో దీన్ని మునుపటి కంటే భారీగా పునర్నిర్మిస్తాం” అని చెప్పాడు. ఈ భవనంలో గతంలో వందలాది ముజాహిద్దీన్‌లు (ఉగ్రవాదులు) శిక్షణ పొందారని ఆయన అంగీకరించాడు.

ఉగ్ర శిక్షణకు పిలుపునిచ్చిన ఖాసిం..
మరో వీడియోలో ఖాసిం, పాకిస్థానీ యువతను 'దౌరా-ఎ-సుఫ్ఫా’ అనే ఉగ్ర శిక్షణ కార్యక్రమంలో చేరమని పిలుపునిచ్చాడు. ఇందులో మతపరమైన బోధనలతో పాటు జిహాదీ సిద్ధాంతం, శారీరక పోరాట శిక్షణ ఇస్తారని వెల్లడించాడు. 2000లో స్థాపించబడిన ఈ మురిద్కే శిబిరం LeTకి ముఖ్య శిక్షణ కేంద్రంగా పని చేసింది.
లష్కరే డిప్యూటీ చీఫ్ అంగీకారం..
లష్కరే-తయ్యిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ, మరో వీడియోలో పాక్ ప్రభుత్వం, సైన్యం తమకు ధ్వంసమైన శిబిరాలను పునర్నిర్మించడానికి నిధులు అందజేశాయి అని స్పష్టంగా తెలిపాడు. భారత్ ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసం చేసిన తొమ్మిది ఉగ్ర శిబిరాల్లో మురిద్కే క్యాంప్ కూడా ఒకటేనని అతను అంగీకరించాడు.
జైషే-మొహమ్మద్ (JeM) కమాండర్ ఇలియాస్ కశ్మీరీ కూడా మరో ప్రసంగంలో కీలక విషయాలు వెల్లడించాడు. బాహవల్‌పూర్‌లోని మార్కజ్ సుభాన్ అల్లా ప్రధాన కార్యాలయం ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైందని, ఈ దాడిలో JeM చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులు మరణించారని ఆయన అంగీకరించాడు. ఈ శిబిరం 2019లో జరిగిన పుల్వామా దాడితో సహా అనేక ఉగ్ర కుట్రలకు లింక్ అయిందని అంతర్జాతీయ నిఘా వర్గాలు ఇప్పటికే గుర్తించాయి.
ఆపరేషన్ సిందూర్..
పహల్గాంలో 2025 ఏప్రిల్ 22న ఉగ్రవాదులు 26 మంది అమాయకులను హత్య చేయడంపై ప్రతీకారంగా భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో పాక్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర శిబిరాలను టార్గెట్ చేశారు. వీటిలో మురిద్కే, బాహవల్‌పూర్ ప్రధాన శిబిరాలు ఉన్నాయి.
-
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పాకిస్తాన్ ‘డెడ్ లైన్’.. వణుకుతున్న ఐఎస్ఐ అగ్రనేతలు! -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
మహారాష్ట్రలోని అండర్ వరల్డ్ డాన్ "దావూద్ ఇబ్రహీం" ఆస్తులు వేలం..! -
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
INSPIRING STORY : నాడు రోజుకు రూ.5 రైతు కూలీ.. నేడు ఆక్స్‌ఫర్డ్‌లో "ఏఐ" పై ప్రసంగం..! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!











Click it and Unblock the Notifications