26 మంది విద్యార్థులపై అత్యాచారం చేశాడు, టీచర్‌కు మరణ శిక్ష
బీజింగ్: సొంత బిడ్డలను చూసుకున్నట్లు చూసుకోవలసిన విద్యార్థుల పట్ల దారుణంగా ప్రవర్తించిన ఒక టీచర్‌కు మరణ శిక్ష విధిచారు. ఇక ముందు విద్యార్థులతో ఈ విధంగా ప్రవర్తించే టీచర్లకు ఇదే శిక్షపడుతుందని చైనా కోర్టు హెచ్చరించింది.
గురువారం చైనా లోని గాస్సు ప్రావిన్స్ లోని టియాన్ షుయ్ నగరంలో లీ జిషున్ అనే కామాంధుడికి మరణ శిక్ష అమలు చేశారని స్థానిక న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. లీ జిషున్ ఒక ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్నాడు. ఇతను 4 సంత్సరాల నుండి 11 సంవత్సరాల వయస్సు ఉన్న అమ్మాయిల మీద కన్ను వేశాడు.

పాఠశాల గదులు, హాస్టళ్లలలో 26 మంది అమ్మాయిల మీద రేప్ చేశాడు. వారిని లైంగికంగా వేదించాడు. 2011 నుండి 2012 మద్య కాలంలో లీ ఈ దారుణాలకు పాల్పడ్డాడు. చివరికి ఇతని బండారం బయటపడటంతో పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.
కేసు విచారణ చేసిన న్యాయమూర్తి నిందితులు లీ నేరం చేసినట్లు తెలుసుకున్నారు. లీ అమ్మాయిల మీద రేప్ చేసినట్లు ఆదారాలు ఉన్నాయని వెంటనే అతనికి మరణ శిక్ష అమలు చెయ్యాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 2012 నుండి 2014 సంవత్సరాల మద్య కాలంలో చైనాలో 7,145 రేప్ కేసులను కోర్టు విచారించాయి.












Click it and Unblock the Notifications