ప్రపంచ కుబేరుల జాబితా: ఎలాన్ మస్క్ ను దాటేసిన లారీ ఎల్లిసన్.. కానీ!
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్.. ఇది నిన్నటి వరకు అందరూ చెప్పిన పేరు . కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని ఒరాకిల్ చీఫ్ లారీ ఎల్లిసన్ భర్తీ చేస్తున్నట్టు బ్లూమ్ బెర్గ్ నివేదిక వెల్లడించింది. ఎలాన్ మస్క్ కి సంబంధించి టెస్లా, స్పేస్ ఎక్స్ షేర్లు ఇటీవల కుదేలవటంతో, మస్క్ షేర్ల విలువ భారీగా పడిపోవడంతో కుబేరుల జాబితా నుంచి మస్క్ కిందికి దిగాల్సి వచ్చింది.
తగ్గిన ఎలాన్ మస్క్ షేర్ల విలువ
కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ తర్వాత స్థానంలో ఉన్న ఒరాకిల్ చీఫ్ లారీ ఎల్లిసన్ కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా సంస్థ విలువ పెరగడంతో ఆయన మస్క్ ను కిందికి నెట్టేసి టాప్ కు చేరుకున్నారు. ఎలాన్ మస్క్ ప్రస్తుత నెట్ వర్త్ సెప్టెంబరు 2025నాటికి 385 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ సంవత్సరం ఎలాన్ మస్క్ కు సంబంధించిన టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల విలువ 13శాతం తగ్గింది.

ఏఐ తో దూసుకుపోతున్న ఒరాకిల్, పెరిగిన ఎల్లిసన్ షేర్లు
లారీ ఎల్లిసన్ కు సంబంధించి ప్రస్తుత నెట్ వర్త్ సెప్టెంబరు 2025 నాటికి 393 బిలియన్ డాలర్లుగా ఉంది. ఒరాకిల్ సంస్థ ఈ సంవత్సరం ఏ ఐ క్లౌడ్ ఒప్పందాలు చేసుకోవడం, ఓపెన్ ఏఐ తో డీల్ చేసుకోవడం వంటి పరిణామాలు సంస్థకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. మొన్న మంగళవారం ఒక్కరోజే ఎల్లిసన్ సంపద 101 బిలియన్ డాలర్లు పెరగడం గమనార్హం. ఒరాకిల్ లో ఎల్లిసన్ వాటా 40శాతం ఉంది.
కొద్దిసేపు మస్క్ ను దాటేసిన లారీ ఎల్లిసన్
ఇటీవల కంపెనీ షేర్లు పుంజుకోవడంతో ఆయన సంపద సైతం పెరిగింది. ఈ పరిణామంతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం లారీ ఎల్లిసన్ సంపద మొత్తం 393 బిలియన్ డాలర్లుగా నమోదు అయింది. అయితే ఇది అప్పటికే ఉన్న ఎలాన్ మస్క్ సంపద 384 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. అయినా ఈ ఆధిత్యం తాత్కాలికంగానే నిలిచింది. చివరికి ఒరాకిల్ షేర్లు 328 డాలర్ల వద్ద, 36% వృద్ధిని సాధించి ముగిశాయి.
మళ్ళీ టాప్ లోకి ఎలాన్ మస్క్
దీని కారణంగా మళ్లీ లారీ ఎల్లిసన్ యొక్క నికర సంపద పడిపోయింది. 378 బిలియన్ డాలర్లుగా నమోదయింది. దీంతో మళ్లీ మస్క్ ముందు వరుసలోకి రాగా తర్వాత స్థానంలోకి లారీ ఎల్లిసన్ చేరారు. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌లను పోల్చితే, ఎలాన్ మస్క్, లారీ ఎల్లిసన్ ఇద్దరూ కుబేరుల జాబితాలో ముందు వరుసలో ఉన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications