వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాను నియంత్రించాలంటే లాక్‌డౌన్‌లు సరిపోవు.. ఏం చెయ్యాలో చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక భారత దేశంలో కూడా కరోనా ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇక ఇండియాలో ఇప్పటికే కరోనా కేసులు 436నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది. ఇక ప్రరంచ దేశాలకు అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌ను నియంత్రించటానికి లాక్ డౌన్ చేస్తున్నారు వైరస్ ప్రభావిత దేశాలు . ఇక ఈ వైరస్ ను అడ్డుకోవాలంటే కేవలం లాక్‌డౌన్‌లు చాలవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్య్లూహెచ్‌వో) తేల్చి చెప్తుంది.

కరోనా బాధితులను గుర్తించి ట్రీట్మెంట్ చెయ్యాలని చెప్తున్న డబ్య్లూహెచ్‌వో

కరోనా బాధితులను గుర్తించి ట్రీట్మెంట్ చెయ్యాలని చెప్తున్న డబ్య్లూహెచ్‌వో

ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మైక్‌ ర్యాన్‌ వైరస్‌ తిరిగి పుంజుకోకుండా ఉండాలంటే లాక్ డౌన్ సరిపోదని చెప్తున్నారు. ఇక ఆయా దేశాలు చేపట్టే ప్రజారోగ్య చర్యలు కీలకమని ఆయన అన్నారు. కరోనా పూర్తిగా నిర్మూలన అయ్యే వరకు దీనిపై సమరం చెయ్యాల్సిందేనని చెప్పారు. ప్రస్తుతం కరోనా బాధిత దేశాలు వైరస్‌ సోకిన వాళ్లను కనిపెట్టి వాళ్లను ఐసోలేషన్‌ వార్డుకు తరలించడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచిస్తున్నారు.ఇక అది అన్నిటి కంటే ముఖ్యమని చెప్పారు. వైరస్ బాధితులను త్వరిత గతిన గుర్తించి చికిత్స అందిచకుంటే ప్రమాదం అన్నారు.

ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టకపోతే కష్టం

ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టకపోతే కష్టం

అంతే కాదు లాక్‌డౌన్లు విధించినంత మాత్రాన వైరస్‌ను అడ్డుకోలేమని పేర్కొన్నారు. ఇక సరైన ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టకపోతే ఈ లాక్‌డౌన్‌లే మరింత ప్రమాదకరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక చైనా, సింగపూర్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు రక్షణా చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేశాయని, వైరస్‌ బాధితులను వేగంగా గుర్తించాయని పేర్కొన్నారు.

ప్రజలు జాగ్రత్తగా ఉండటం కూడా అనివార్యం

ప్రజలు జాగ్రత్తగా ఉండటం కూడా అనివార్యం

ఆ దేశాలను మిగతా దేశాలు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ వైరస్‌కు టీకా వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటించడమే కీలకమన్నారు. ఇక ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తక్షణ ఆరోగ్య భద్రతా చర్యలు, శుభ్రతా కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. మొత్తానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు పాటించాల్సి ఉంది.

English summary
The coronavirus epidemic is shaking the world. Corona is also showing up in India. There are already 436 cases of corona in India. Virus affected countries are being locked down to control the virus, which is rapidly spreading across the globe. The World Health Organization (WLHO) has ruled that lockdowns are not enough to prevent this virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X