కేతుగ్రస్త చంద్ర గ్రహణం వేళ.. శాపగ్రస్తం

అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏదీ మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టట్లేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తిమంతమైన బాంబులను జారవిడుస్తోంది.

ఈ పరిణామాల మధ్య ఇరాన్‌లోని గరాష్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.3గా రికార్డయింది. గరాష్.. ఇరాన్‌ ఫార్స్ ప్రావిన్స్‌లోని సిటీల్లో ఒకటి. గరాష్ ప్రావిన్స్ కు రాజధాని. దక్షిణ ఇరాన్ లారెస్తాన్ ప్రాంతంలో ఓ భాగం ఇది. కొద్దిసేపటి కిందటే ఇక్కడ 4.3 తీవ్రతతో భూమి ప్రకోపించింది. గరాష్ సిటీకి నైరుతి దిశగా గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

Magnitude 4 3 Earthquake Shakes Gerash in Iran as US-Israel Strikes Escalate Tensions Sparks Fears

ఉపరితలం నుంచి సుమారు 10 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి కంపించినట్లు యూఎస్జీఎస్ తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత భూకంప క్రియాశీలక దేశం.. ఇరాన్. అరేబియా, యూరేషియన్ ప్లేట్ల ఘర్షణ వల్ల ఏర్పడిన జాగ్రోస్ ఫోల్డ్ థ్రస్ట్ బెల్ట్‌లో గరాష్ ఉంది. ఈ ప్రాంతంలో 4 నుండి 5 మాగ్నిట్యూడ్ భూకంపాలు సాధారణం.

ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఈ భూకంపం పట్ల అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఇరాన్ తన అణు సామర్థ్యన్ని పరీక్షించి ఉండొచ్చని భావిస్తోన్నారు. దీని తీవ్రతకు భూమి కంపించి ఉండొచ్చని చెబుతున్నారు. భూగర్భ అణు పరీక్షలు జరిగితే రిక్టర్ స్కేల్ పై 4.5 తీవ్రతకు పైగా భూకంపాలని సంభవించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. తాజా భూకంప తీవ్రత 4.3 కే పరిమితమైందని గుర్తు చేస్తోన్నారు.

ఇరాన్ 24 గంటల్లో అణు బాంబు తయారు చేయగలనని పలుమార్లు ప్రకటించింది. యూరేనియం 60 శాతం వరకు శుద్ధి చేశామని తెలిపింది కూడా. అణు బాంబు తయారీకి 80 నుండి 90 శాతం యురేనియం శుద్ధి అవసరం. శాస్త్రీయ డేటా అణు సామర్థ్య పరీక్షలను ధృవీకరించట్లేదు. ఇది సహజంగానే సంభవించి ఉండొచ్చని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+