శత్రువు పక్కనే: బ్రిటిష్‌పార్లమెంట్ ఎదుట గాంధీ విగ్రహం
లండన్: బ్రిటీష్ వలస పాలకులను తన అహింసా సిద్ధాంతంతో నిలువరించిన భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని బ్రిటన్ పార్లమెంటు ఎదుట ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న బ్రిటన్ ఆర్ధిక మంత్రి జార్జ్ ఆస్బర్న్ ఈ విషయాన్ని వెల్లడించారు.
మహాత్మా గాంధీకి బద్ధ విరోధిగా పేరుగాంచిన విన్‌స్టన్ చర్చిల్ విగ్రహం కూడా బ్రిటన్ పార్లమెంటు వద్ద కొలువై ఉంది. చర్చిల్ 1940-1955 మధ్యకాలంలో రెండు పర్యాయాలు బ్రిటీష్ ప్రధానిగా వ్యవహరించారు.

అప్పట్లో చర్చిల్.. మహాత్ముడిని అర్థనగ్న ఫకీరు అని ఎద్దేవా చేశారు. స్వాతంత్రం కోసం ఉద్యమించిన మహాత్ముడిని బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నోమార్లు జైలులో నిర్బంధించింది. అయితే, ఏ బ్రిటిష్ ప్రభుత్వాన్ని అయితే మహాత్మా గాంధీ భారత్ నుండి తరిమేశారో.. ఆ బ్రిటిష్ పార్లమెంటు ముందు గాంధీ విగ్రహం నెలకొల్పాలనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications