కూలిన విమానం: 295 మంది మృతి, పేల్చివేత?
ఉక్రెయిన్: నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్ డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ వస్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఉక్రెయిన్‌లో కూలిపోయింది. విమానంలో 295 మంది ఉన్నారు. వారంతా మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. క్షిపణితో విమానాన్ని పేల్చి వేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి పది గంటల సమయానికి వంద మృతదేహాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. గ్రాబోవో గ్రామం వద్ద ఈ సంఘటన జరిగింది. విమానం శకలాలు దాదాపు 15 కిలోమీటర్ల చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

విమానంలో ఉన్నవారిలో 280 మంది ప్రయాణికులతో పాటు విమానం సిబ్బంది కూడా మృత్యువాత పడ్డారని భావిస్తున్నారు. ఉక్రెయిన్ అధికారులకు సహకరించాలని అమెరికా శ్వేత సౌధం తన దేశం అధికారులను ఆదేశించింది. రష్యా సరిహద్దుల్లో ఈ ప్రమాదం సంభవించింది.
నాలుగు నెలల క్రితం మలేషియా ఎయిర్‌లైన్స్ ఎంహెచ్ విమానం అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ విమానంలో 295 మంది ఉన్నారు. వారి జాడ కనిపించలేదు. విమానంలోని 280 మంది ప్రయాణికులు, 15 మంది విమాన సిబ్బంది కూడా మరణించినట్లు మలేషియా హోం శాఖ నిర్ధారించింది. ఎంహెచ్ - 17 విమానంతో సంబంధాలు తెగిపోయాయని, ఆ తర్వాత కూలిపోయినట్లు తెలిసిందని, అందులో ఉన్నవారంతా మరణించారని మలేషియన్ ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా తెలిపింది.
స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్న గం.12.14 నిమిషాలకు బయలుదేరిన ఈ విమానం శుక్రవారం ఉదయం గం.6.10 నిమిషాలకు కౌలాలంపూర్ చేరుకోవాల్సి ఉంది. ఈలోపే ప్రమాదం సంభవించింది. ఈ బోయింగ్ విమానం గంటకు 950 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇరు ప్రాంతాల మధ్య దూరం ఎక్కువ కాబట్టి ఈ విమానాన్ని ఉపయోగిస్తారు. ప్రమాద విషయాన్ని రష్యా వార్తా సంస్థ ఇంటర్ ఫాక్స్ తొలుత బయటపెట్టింది. ఆ తర్వాతనే మలేషియా ఎయిర్‌లైన్స్ నిర్ధారించింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications