భారత్‌కు డెడ్ లైన్ విధించిన మాల్దీవులు
మాలె: చైనా పర్యటన అనంతరం మాల్దీవుల సర్కారు మరో సంచలన ప్రకటన చేసింది. మాల్దీవుల నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు భారత్‌కు తేల్చి చెప్పారు. మార్చి 15 నాటికి ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలని తమ అధ్యక్షుడు చెప్పినట్లు మాల్దీవుల అధికారులు భారత హైకమిషనర్‌కు తెలిపారు.
ఆదివారం ఈ మేరకు మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని వెనక్కి పిలిపించాలన్న అభ్యర్థనపై ఇరు దేశాల అధికారులు మాలేలోని విదేశాంగ శాఖ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. భారత్‌తో చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా సమీక్షించనున్నట్టు ఆ దేశ సమాచార వ్యవహారాల మంత్రి ఇబ్రహీం ఖలీల్ స్థానిక మీడియాకు వెల్లడించడం గమనార్హం.

గతంలో మానవతా అవసరాల కోసం భారత్ ఇచ్చిన రెండు హెలికాప్టర్లను వినియోగించడం ఆపేయాలని అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ఆదేశించినట్లు తెలిపారు. కాగా, ప్రస్తుతం మాల్దీవుల్లో 88 మంది భారత సైనిక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. గత సంవతసరం నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ముయిజ్జు భారత్‌ను కోరారు. ఇండియా ఔట్ అంటూ ర్యాలీలు కూడా ఆయన నిర్వహించారు.
ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారత్‌పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో బైకాట్ మాల్దీవులు అంటూ భారత్ నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో దీంతో వారిపై వేటు పడింది. ఈ క్రమంలోనే మాల్దీవుల అధ్యక్షుడు చైనాలో పర్యటించారు. చైనా పర్యాటకులను ఎక్కువగా పంపించాలని కోరారు. ఆ పర్యటన తర్వాత తాజా నిర్ణయం వెలువడటం గమనార్హం.












Click it and Unblock the Notifications