Maldives: భారత్ దెబ్బకు చైనాను బతిమాలుకుంటున్న మాల్దీవులు...!
భారత్ లోని లక్షదీవులకు ప్రధాని మోడీ విహారానికి వెళ్లడంపై అక్కసు వెళ్లగక్కిన మాల్దీవులుకు వరుస ఎదురుదెబ్బలు తప్పడం లేదు. వెంటనే విషయం గ్రహించి మోడీపై విమర్శలు చేసిన మంత్రుల్ని సస్పెండ్ చేసినా వివాదం మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే మాల్దీవులకు బదులు మన దేశంలోని లక్షదీవులకే వెళ్లాలని పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాల్దీవులకు భారత్ నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య కూడా భారీగా పడిపోతోంది.
ఈ నేపథ్యంలో చైనా పర్యటనకు వెళ్లిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు.. ఐదు రోజుల పాటు పలు కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే చైనా మంత్రుల్ని, పెద్దల్ని కలుస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు .. ఇవాళ ఆ దేశాన్ని ఓ రిక్వెస్ట్ చేశారు. మాల్దీవులకు చైనా నుంచి విరివిగా పర్యాటకుల్ని పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మాల్దీవుల బిజినెస్ ఫోరం సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ మేరకు చైనా ప్రభుత్వాన్ని కోరారు.

తమ దేశానికి ఇకపై ఎక్కువ మంది పర్యాటకులను పంపించే ప్రయత్నాలను వేగవంతం చేయాలని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు చైనాకు విజ్ఞప్తి చేశారు. చైనాలో తన ఐదు రోజుల పర్యటనలో రెండవ రోజు, ముయిజ్జు ఫుజియాన్ ప్రావిన్స్‌లోని మాల్దీవుల బిజినెస్ ఫోరమ్‌లో తన ప్రసంగంలో చైనాను తమ సమీప మిత్రదేశంగా పేర్కొన్నారు. చైనా మా సన్నిహిత మిత్రదేశాలలో ఒకటి అలాగే అభివృద్ధి భాగస్వాములలో ఒకటన్నారు. 2014లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) ప్రాజెక్టులను ఆయన ప్రశంసించారు. అవి మాల్దీవుల చరిత్రలో అత్యంత ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అందించాయని ఆయన గుర్తుచేశారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications