Marburg virus: ముప్పేటదాడి: గబ్బిలాల నుంచి డేంజరస్ డిసీజ్: సోకితే చనిపోవడానికి 88% ఛాన్స్

జెనీవా: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తోంది. ఏడాదిన్నర కాలంగా భూగోళం మొత్తాన్నీ గడగడలాడిస్తోంది. దీని బెడద ఎప్పుడు పూర్తిగా తగ్గుతుందో తెలియదు. వేవ్‌ల మీద వేవ్‌లు వచ్చిపడుతోన్నాయి. వచ్చిన ప్రతీసారీ లక్షలాది మంది ప్రాణాలను హరించి వేస్తోంది కరోనా వైరస్. ప్రపంచవ్యాప్తంగా 43 లక్షల మందికి పైగా కరోనా బారిన పడి మరణించారు.

ఈ సంఖ్య అక్కడితో ఆగేలా కనిపించట్లేదు. కాలం గడిచే కొద్దీ మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఈ వైరస్‌పై ప్రపంచ దేశాలన్నీ ఓ యుద్ధమే చేస్తోన్నాయి. కరోనా వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుని మరీ విజృంభిస్తోంది. కరోనా ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్‌డైన్‌లోకి వెళ్లిపోయాయి. అది మిగిల్చిన సంక్షో్భ సరిస్థితుల నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాయి.

కొత్త వైరస్..

కొత్త వైరస్..

ఈ పరిస్థితుల మధ్య మరో కొత్త వైరస్, డిసీజ్ వెలుగులోకి వచ్చింది. దాని పేరు మార్బర్గ్ వైరస్ (Marburg virus). పశ్చిమ ఆఫ్రికా దేశంలో గినియాలో తొలిసారిగా ఇది నమోదైంది. సియెర్రాలియాన్, లైబీరియా సరిహద్దుల్లో ఉండే గ్వెక్కెడో అనే గ్రామంలో ఈ వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ప్రమాదకరమైన డీసీజ్, వైరస్‌గా దీన్ని నిర్ధారించింది. కరోనా వైరస్ కంటే వేగంగా విస్తరించే లక్షణాలు ఈ మార్బర్గ్ వైరస్‌కు ఉందని స్పష్టం చేసింది. దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రపంచ దేశాలను హెచ్చరించింది.

88 శాతం వరకు మరణించే ఛాన్స్..

88 శాతం వరకు మరణించే ఛాన్స్..

ఇదివరకే వెలుగులోకి వచ్చిన ఎబోలా జాతికి చెందిన వైరస్‌ అని, కరోనా తరహాలోనే అత్యంత వేగంగా వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ వైరస్ సోకిన వారిలో 24 శాతం నుంచి 88 శాతం వరకు చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ వైరస్ బారిన పడ్డ వ్యక్తి శరీర తత్వం, రోగ నిరోధక శక్తి, వయస్సు మీద ఆధారపడి చూస్తే- గరిష్ఠంగా 88 శాతం వరకు పేషెంట్ మరణించడానికి అవకాశం ఉందని వివరించింది. ప్రారంభంలోనే దీనికి అడ్డు కోవడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాల్సి ఉందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

గబ్బిలాల నుంచే

గబ్బిలాల నుంచే

గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందే వైరస్ అని డబ్ల్యూహెచ్ఓ తెలియజేసింది. గబ్బిలాల నుంచి మనుషులకు సులువుగా సోకుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. దాని బారిన పడిన వారికి కూడా గబ్బిలాల నుంచే ఇది సోకి ఉంటుందని అనుమానిస్తోన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. సాధారణంగా మార్బర్గ్ వైరస్ రోసెట్టస్ గబ్బిలాలు ఉండే చోట ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందని గుర్తించినట్లు స్పష్టం చేసింది. మనుషులకు సోకిన సులభంగా మరొకరికి వ్యాపిస్తుందని పేర్కొంది. మార్బర్గ్ వైరస్ సోకగానే తీవ్ర జ్వరం, విపరీతమైన తలనొప్పి కలుగుతుందని అవే దీని లక్షణాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

తొలి మరణం కూడా..

తొలి మరణం కూడా..

గినియాలోని గ్వెక్కెడాలో ఈ కేసును తొలిసారిగా గుర్తించారు. ఈ నెల 2వ తేదీన ఓ వ్యక్తి మృతదేహంలో మార్బర్గ్ వైరస్‌ను గుర్తించినట్టు గినియా ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. మార్బర్గ్ వైరస్ సోకడం వల్లే అతను మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. విపరీతమైన జ్వరం రావడం వల్ల తొలుత- దాన్ని మలేరియా ఫీవర్‌గా భావించినప్పటికీ.. లక్షణాలు అలా లేకపోవడం వల్ల డాక్టర్లు అతనికి మరిన్ని పరీక్షలను నిర్వహించగా.. అసలు విషయం తెలిసింది.

ఈ వైరస్ వల్లే అతను మరణించి ఉంటాడని అధికారులు అనుమానిస్తోన్నారు. తీవ్ర జ్వరంతో బాధపడిన బాధితుడికి సకాలంలో వైద్య చికిత్స అందించినప్పటికీ.. ప్రాణాలను నిలపలేకపోయామని గినియా ప్రభుత్వం చెబుతోంది.

ఎబోలా రకానికి చెందిన వైరస్..

ఎబోలా రకానికి చెందిన వైరస్..

చికిత్స అందిస్తోన్న సమయంలోనే ఆ పేషెంట్ మరణించాడని, అనంతరం అతని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. అందులో ఎబోలా నెగెటివ్ వచ్చింది. మృతదేహం నుంచి సేకరించిన శాంపిళ్లను మరింత లోతుగా పరీక్షించగా.. అది మార్బర్గ్‌గా నిర్ధారించినట్లు స్థానిక అధికారులు స్పష్టం చేశారు. గ్వెక్కెడాలో నమోదైన తొలి పాజిటివ్‌ కేసు, మరణం ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

దీన్ని మొదట్లోనే అడ్డుకోవడానికి తక్షణ ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫ్రికా రీజనల్ డైరెక్టర్ డాక్టర్ మోయెతీ హెచ్చరించారు. గబ్బిలాలు తిరుగాడే ప్రదేశాలకు వెళ్లకుండా స్థానిక ప్రజలను నిలువరించేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. వాటిని ఆహారంగా స్వీకరించడాన్ని కూడా నిషేధించాల్సిన తక్షణ అవసరాన్ని పరిశీలించాలని ఆయా దేశాల ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.

పశ్చిమాఫ్రికా అప్రమత్తం..

పశ్చిమాఫ్రికా అప్రమత్తం..

మార్బర్గ్ వైరస్ సోకగానే తీవ్ర జ్వరం, తలనొప్పి, వాంతులు, వికారం కలుగుతుందని, అనంతరం క్రమంగా తీవ్ర అనారోగ్యానికి అది దారి తీస్తుందని తెలిపింది. దక్షిణాఫ్రికా, అంగోలా, కెన్యా, ఉగాండా, కాంగో దేశాల్లో ఎబోలా పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ.. ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలను కలిగి ఉందని మోయెతీ పేర్కొన్నారు.

మార్బర్గ్ వైరస్ వెలుగులోకి వచ్చిన వెంటనే తాము గినియా సహా పొరుగునే ఉన్న సియెర్రాలియన్, లైబీరియా, కోెటే డి ఐవరీ, గినియా బిసావ్.. వంటి ఇతర పశ్చిమ ఆఫ్రికా దేశాలను అప్రమత్తం చేశామని అన్నారు. ప్రత్యేకించి- సరిహద్దు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినట్లు తెలిపారు.

వేగంగా విస్తరించే లక్షణాన్ని కలిగి ఉండటం ఆంందోళనకరమని, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. అది విజృంభించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు. కొన్ని రోజుల పాటు సరిహద్దులను మూసి ఉంచడం శ్రేయస్కరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ నిర్ణయానికి వచ్చినట్లు మొయెతీ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+