గంటలోనే 3 సార్లు భారీ భూకంపం .. భయంతో ప్రజలు పరుగులు

టిబెట్ లో భారీ భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై భూకంపం తీవ్రత 5.7 గా నమోదైంది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్లనుంచి పరుగులు తీశారు. టిబెట్ దేశవ్యాప్తంగా భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Massive Earthquake Strikes Tibet Measuring 5 7 on Richter Scale

చుట్టూ కొండలతో నిండి ఉన్న దేశం టిబెట్. ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితి కారణంగా వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా మరోసారి టిబెబ్ లో భారీ భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై భూకంపం తీవ్రత 5.7 గా నమోదైంది. దీంతో ఈ ప్రాంతంలోని భౌగోళిక కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలాజీ తెలిపింది.

టిబెట్ లో వరుసగా మూడు సార్లు భూమి కంపించింది. ఇవాళ తెల్లవారు జామున 2 నుంచి 3 గంటల సమయంలో మూడుసార్లు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో జనం ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇళ్లనుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. మొదట 2 గంటల 41 నిమిషాలకు గంటలకు ప్రకంపనలు వచ్చాయి. రిక్టార్‌ స్కేల్‌ పై 5.7 తీవ్రత నమోదైంది.

ఆ తర్వాత రెండోసారి ఉదయం 3గంటల 6 నిమిషాలకు మళ్లీ ప్రకంపనలు వచ్చాయి. రిక్టార్‌ స్కేల్‌ పై 3.7 తీవ్రత నమోదైంది. ఇక మూడోసారి ఉదయం 3 గంటల 48 నిమిషాల ప్రాంతంలో ఆఖరిసారి ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టార్‌ స్కేల్‌ పై 3.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని అధికార వర్గాలు తెలిపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+